ePaper
More
    HomeతెలంగాణHarish Rao | జాబ్​ క్యాలెండర్​ ఎక్కడ.. సీఎంపై హరీశ్​రావు ఫైర్​

    Harish Rao | జాబ్​ క్యాలెండర్​ ఎక్కడ.. సీఎంపై హరీశ్​రావు ఫైర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | గాంధీ కుటుంబం తెలంగాణ నిరుద్యోగ యువతను దారుణంగా మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. శనివారం తెలంగాణ భవన్(Telangana Bhavan)​లో ఆయనను పలువురు నిరుద్యోగులు కలిశారు. తమ పోరాటానికి బీఆర్​ఎస్​ మద్దతు ఇవ్వాలని వారు కోరారు.

    ఈ సందర్భంగా హరీశ్​రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి(CM Revanth Reddy)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే జాబ్​ క్యాలెండర్​ విడుదల చేస్తామని కాంగ్రెస్​ హామీ ఇచ్చిందని.. ఇప్పుడు జాబ్​ క్యాలెండర్(Job calendar)​ ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్‌లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదన్నారు. ట్రాన్స్​కో, ఎన్పీడీసీఎల్​, ఎస్​పీడీసీఎల్​లో పోస్టుల భర్తీకి 2024 అక్టోబర్​లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని కాంగ్రెస్​ ప్రభుత్వం(Congress Government) చెప్పిందన్నారు. 2025 సగం అయిపోయినా.. ఇప్పటికీ జాడ లేదని ఆయన ఎద్దేవా చేశారు.

    Harish Rao | మెగా డీఎస్సీ ఎప్పుడు..

    గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్లకు జనవరి 2025లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఫిబ్రవరి 2025లో మెగా DSC నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పారన్నారు. కానీ ఇంతవరకు నోటిఫికేషన్(Notification)​ రాలేదని విమర్శించారు. ఇలాగే చాలా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి.. నిరుద్యోగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

    Harish Rao | యూత్​ డిక్లరేషన్​ అమలు చేయాలి

    అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్​ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) రాష్ట్రానికి వచ్చి యూత్​ డిక్లరేషన్​ విడుదల చేసిందని హరీశ్​రావు గుర్తు చేశారు. అందులో పేర్కొన్న ఐదు అంశాల్లో ఏ ఒక్కటి అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు ఇచ్చినా ప్రియాంక గాంధీ ఎటు పోయారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...