ePaper
More
    HomeతెలంగాణKonda Murali | మంత్రి పొంగులేటి మాపై కుట్ర చేస్తున్నారు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

    Konda Murali | మంత్రి పొంగులేటి మాపై కుట్ర చేస్తున్నారు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Konda Murali | కాంగ్రెస్​ నాయకుడు, మంత్రి కొండా సురేఖ భర్త మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా ఇన్​ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) తమపై కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శనివారం ఆయన గాంధీ భవన్​లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు.

    కొండా మురళి(Konda Murali) ఇటీవల కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్​రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి వరంగల్​ జిల్లా ఎమ్మెల్యేలు కొండా దంపతులకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. కాంగ్రెస్​ రాష్ట్ర ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శనివారం కొండా మురళి పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.

    Konda Murali | సీతక్కతో విభేదాలు లేవు

    పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన కొండా మురళి కమిటీ ఛైర్మన్​ మల్లు రవి(Chairman Mallu Ravi)కి ఆరు పేజీల రిపోర్టు ఇచ్చారు. తమకు మంత్రి సీతక్క(Minister Seethakka)తో విభేదాలు లేవని అందులో పేర్కొన్నారు. సీతక్క, సురేఖ కలిసి పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2007 నుంచి వరంగల్‌ విషయాలు తానే పర్యవేక్షిస్తున్నట్లు ఆయన అన్నారు. తన భార్యపై కక్షతో వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

    తమపై ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి కుట్ర చేస్తున్నారని కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని పొంగులేటి ఏకం చేస్తున్నారని ఆరోపించారు. తమ నియోజకవర్గంలో వ్యతిరేకులతో కలిసి తిరిగినా.. ఎక్కడా ఇబ్బందులు పెట్టలేదన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌కు వచ్చినప్పుడు తాను రాజీనామా చేసి వచ్చానని ఆయన చెప్పారు. కొంతమందిలా పార్టీ మారినా పదవిలో కొనసాగలేదని కడియం శ్రీహరి(Kadiyam Srihari)ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. వర్ధన్నపేట, భూపాలపల్లి, పరకాలలో తమకు బలం ఉందని కొండా మురళి పేర్కొన్నారు. ఎన్నికల్లో తమ మద్దతుతోనే రేవూరి ప్రకాశ్(Revuri Prakash)​ గెలిచారని.. కానీ ప్రస్తుతం తమకు వ్యతిరేకంగా రేవూరి పనిచేస్తున్నారని ఆరోపించారు.

    More like this

    Nizamabad KFC | కేఎఫ్సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC | రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని వేణుమాల్(Venu Mall)లో గల కేఎఫ్సీ...

    Stock Markets | ఐటీలో కొనసాగిన జోరు.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) వైపు అడుగులు...

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...