ePaper
More
    HomeతెలంగాణPJR Flyover | హైదరాబాద్​ నగరవాసులకు గుడ్​న్యూస్​.. నేటి నుంచి కొత్త ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి..

    PJR Flyover | హైదరాబాద్​ నగరవాసులకు గుడ్​న్యూస్​.. నేటి నుంచి కొత్త ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:PJR Flyover | హైదరాబాద్ నగర ప్రజలకు, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ (Outer Ring Road) నుంచి కొండాపూర్, హఫీజ్‌పేట్, హైటెక్ సిటీ(Hitech City) వంటి ప్రాంతాలకు ప్రయాణించే వాహనదారులకు శుభవార్త. ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారిన గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద సమస్యను పరిష్కరించేందుకు నిర్మించిన పీజేఆర్ మల్టీ-లెవల్ ఫ్లైఓవర్(PJR Multi-Level Flyover) నేటి నుంచే ప్రజలకు అందుబాటులోకి రానుంది.. ఈ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

    PJR Flyover | ఫ్లైఓవర్ నిర్మాణ విశేషాలు:

    ప్రాజెక్ట్: వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం (SRDP) కింద నిర్మించారు.
    వ్యయము: రూ. 182.72 కోట్లు
    పొడవు: 1.2 కిలోమీటర్లు
    వెడల్పు: 24 మీటర్లు
    లేన్లు: మొత్తం ఆరు లేన్‌లు

    నిర్మాణ ప్రత్యేకత: ఇది ఇప్పటికే ఉన్న రెండు ఫ్లైఓవర్లపై నిర్మించిడం జ‌రిగింది. మూడవ-స్థాయి నిర్మాణంగా చెప్పుకోవ‌చ్చు. కింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్(Gachibowli Junction Flyover) ఉండ‌గా, దాని శిల్పా లేఅవుట్ ఫేజ్–1 ఫ్లైఓవర్ ఉంది. ఇప్పుడు దాని పైన ఫేజ్–2 ఫ్లైఓవర్ నిర్మించడం జ‌రిగింది.

    ప్రయోజనాలు: గచ్చిబౌలి ట్రాఫిక్ జామ్‌లకు చెక్ పడనుంది. ట్రాఫిక్ హాట్‌స్పాట్‌గా మారిన గచ్చిబౌలి జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్‌తో ఊరట లభించనుంది.

    మెరుగైన కనెక్టివిటీ: ORR నుంచి కొండాపూర్, హఫీజ్‌పేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ ప్రాంతాలకు వేగంగా చేరుకోగలిగే అవకాశం కలుగనుంది. శంషాబాద్ విమానాశ్రయం చేరుకోవడం సులభమవుతుంది. కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల ట్రాఫిక్ స‌మ‌స్యని తప్పించుకొని నేరుగా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లొచ్చు. ప్రయాణ సమయం ఆదా అవుతుంది. గంటల తరబడి ట్రాఫిక్‌లో కూరుకుపోయే అవసరం ఇక లేదు. SRDP ద్వారా చేపట్టిన మొత్తం 42 పనులలో ఇప్పటివరకు 37 పూర్తయ్యాయి. ఫలక్‌నుమా మరియు శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB)ల‌ని జూలై, ఆగస్టు చివరినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. GHMC ఆధ్వర్యంలో రూ. 7032 కోట్లతో 58 ప్రాజెక్టులను H సిటీ ద్వారా చేపట్టనున్నట్లు సమాచారం. ఇందులో 28 ఫ్లైఓవర్లు,13 అండర్‌పాస్‌లు, 4 ROBలు, 3 రైల్వే అండర్‌బ్రిడ్జిలు, 10 రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు.

    ఈ ఫ్లైఓవర్ ప్రారంభం హైదరాబాద్(Hyderabad) మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలక మైలురాయిగా మారనుంది. GHMCకి ఇచ్చిన నిధుల మంజూరుతో నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక ట్రాఫిక్‌తో తలలు పట్టుకునే రోజులు పోయాయి. పీజేఆర్ ఫ్లైఓవర్‌తో మీ ప్రయాణం సాఫీగా, వేగంగా సాగుతుంది.

    Latest articles

    Student refuses Governor | గవర్నర్​ నుంచి డిగ్రీ పట్టా తీసుకునేందుకు నిరాకరించిన విద్యార్థిని

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Student refuses Governor : ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని అనూహ్యంగా ప్రవర్తించింది. స్నాతకోత్సవం(convocation)లో ముఖ్య అతిథి...

    America | అమెరికాలో ఇండియన్లకు కొత్త సమస్యలు.. గడువుకు ముందే బహిష్కరణ నోటీసులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: America : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) తిరిగి అధికారంలోకి...

    Indiramma house | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్​న్యూస్​.. గృహ ప్రవేశాలపై సీఎం రేవంత్​ కీలక ఆదేశాలు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Indiramma house : రాష్ట్ర వ్యాప్తంగా భూముల‌కు భూధార్ నెంబ‌ర్ల కేటాయింపున‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని...

    Girlfriend turns thief | ప్రియుడి కోసం దొంగగా మారిన ప్రియురాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Girlfriend turns thief | ఇటీవల వక్ర ప్రేమ కథలు ఎక్కవగా ప్రచారం అవుతున్నాయి. ప్రియుడి...

    More like this