అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran Rajai port explosion : దక్షిణ ఇరాన్‌లోని పోర్టులో భారీ పేలుడు సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. దాదాపు 750 మంది గాయపడ్డారు. బందర్ అబ్బాస్ నగరానికి వెలుపల ఉన్న రాజై ఓడరేవులో శనివారం ఈ పేలుడు చోటుచేసుకుంది.
రాజై పోర్టులో ఉన్న కంటైనర్లలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. నౌకాశ్రయంలో పేలుడు సంభవించిన తర్వాత దట్టమైన నల్లటి పొగ కమ్ముకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, పేలుడుకు గల కారణాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.