ePaper
More
    HomeజాతీయంToll Tax | హైవేలపై ప్రయాణం చేస్తున్నారా.. ఈ యాప్​ వాడండి.. టోల్​ఛార్జీల భారం తగ్గుతుంది..!

    Toll Tax | హైవేలపై ప్రయాణం చేస్తున్నారా.. ఈ యాప్​ వాడండి.. టోల్​ఛార్జీల భారం తగ్గుతుంది..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Toll Tax | జాతీయ రహదారులపై ప్రయాణం చేస్తే వాహనదారులు టోల్​ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆయా హైవేలపై అనేక టోల్​గేట్లు(Toll Gates) ఉన్నాయి. దీంతో వాహనదారులు టోల్​ఛార్జీల భారంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తక్కువ టోల్​ఛార్జీలు అయ్యే మార్గాలను సూచించడానికి నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా (NHAI) కొత్తగా యాప్​ తీసుకొచ్చింది. దీంతో వాహనదారుల టోల్​ భారం కొంత మేర తగ్గే అవకాశం ఉంది.

    ఎన్​హెచ్​ఏఐ రాజ్‌మార్గ్‌ యాత్రా యాప్‌(NHAI Rajmarg Yatra App)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని ఇన్​స్టాల్ చేసుకుంటే మనం వెళ్లే మార్గంలో తక్కువ టోల్​ ఛార్జీలు(Toll charges) అయ్యే మార్గాన్ని సూచిస్తుంది. ఈ యాప్​ జూలై నుంచి అందుబాటులోకి రానుంది. నగరాలకు వెళ్లడానికి.. అనేక మార్గాలు ఉంటాయి. అయితే అందులో ఏ మార్గంలో వెళ్తే తక్కువ టోల్​ఛార్జీ అవుతుందో ఈ యాప్​ ద్వారా తెలుసుకోవచ్చు. 2023లో రూపొందించిన హైవే యాత్ర యాప్(Highway Yatra App) జాతీయ రహదారుల వెంట వివిధ సౌకర్యాల గురించి సమాచారాన్ని అందిస్తోంది. తాజాగా రూపొందించిన యాప్​ రెండు ప్రదేశాల మధ్య వేర్వేరు మార్గాల్లో వర్తించే టోల్ టాక్స్‌(Toll Tax)ల గురించి వివరాలను వాహనదారులకు తెలియజేస్తుంది.

    READ ALSO  Shibu Soren | జార్ఖండ్​ మాజీ సీఎం శిబుసోరెన్ కన్నుమూత

    Toll Tax | ఎన్​హెచ్​ఏఐ ప్రత్యేక చర్యలు

    ప్రస్తుతం జాతీయరహదారులపై ఎక్కువగా ప్రయాణాలు చేసే వారు టోల్​ ఛార్జీలతో అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో వాహనదారుల సౌలభ్యం కోసం ఎన్​హెచ్​ఏఐ అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఫాస్టాగ్​ విధానం తీసుకు రావడంతో వాహనదారుల సమయం ఆదా అవుతుంది. ఇటీవల NHAI ఫాస్ట్‌ట్యాగ్(Fastag) ఏడాది పాస్‌ను విడుదల చేసింది. రూ. 3,000 ధరతో ఈ పాస్​ తీసుకుంటే ఏ జాతీయ రహదారిపై అయినా.. 200సార్లు టోల్​ ఫీ లేకుండా తిరగొచ్చు. వార్షిక పాస్ కోసం NHAI వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

    Latest articles

    Jersey auction | జెర్సీ వేలం.. వామ్మో ఆటగాడి జెర్సీకి రికార్డు ధ‌ర!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jersey auction | ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ భారత క్రికెట్‌కు కీల‌క మ‌లుపు అనే...

    Bathroom Tips | బాత్రూమ్ కంపు కొడుతోందా.. ఈ 10 టిప్స్ మీకోసమే

    అక్షరటుడే, హైదరాబాద్: Bathroom Tips | ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా, బాత్రూమ్ నుండి వచ్చే దుర్వాసన చాలా...

    Today Gold Price | స్థిరంగా బంగారం ధ‌ర‌లు.. వెండి ప‌రిస్థితి ఏమిటంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ప్ర‌స్తుతం బంగారం కొనుగోలు చేయాలంటే భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఇటీవ‌ల...

    Siraj Rakhi Celebration | రూమ‌ర్ల‌కి చెక్.. మహ్మద్ సిరాజ్‌కు ఆశా భోస్లే మనవరాలు రాఖీ కట్ట‌డంతో వ‌చ్చిన క్లారిటీ..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Siraj Rakhi Celebration | టీమిండియా (Team India) స్టార్ పేసర్, హైదరాబాద్ ఆటగాడు (Hyderabad...

    More like this