ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిRTC banswada | బాన్సువాడ నుంచి రామప్పకు టూర్ ప్యాకేజీ

    RTC banswada | బాన్సువాడ నుంచి రామప్పకు టూర్ ప్యాకేజీ

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: RTC banswada | ప్రయాణికులకు ఆర్టీసీ సువర్ణావకాశాన్ని కల్పించింది. కుటుంబ సభ్యులు ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్లాల్సి వస్తే ప్రైవేటు బస్సులు, బస్​ ట్రావెల్స్‌‌ ఏజెన్సీలతో (Bus Travel Agency) మాట్లాడుకుని వాహనాలను బుక్​ చేసుకుంటారు. అయితే ఈ ట్రిప్​లకు ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఇలాంటి వారికోసం ఆర్టీసీ యాజమాన్యం వెసులుబాటు కల్పించింది. పుణ్యక్షేత్రాలకు, విహారయాత్రలకు వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది.

    RTC banswada | భద్రకాళి అమ్మవారి దర్శనం..

    బాన్సువాడ నుంచి వరంగల్ (Warangal) జిల్లాలోని రామప్ప, లక్నవరం, భద్రకాళి గుడి ప్యాకేజీ టూర్ ఈనెల 6న డీలక్స్ బస్సు బయలుదేరుతున్నట్లు డిపో మేనేజర్ సరిదా దేవి తెలిపారు. ఉదయం 6 గంటలకు బయలుదేరి పాలంపేటలోని రామప్ప శివుని (రామలింగేశ్వరుని) దర్శనం తర్వాత లక్నవరం సస్పెన్షన్ బ్రిడ్జి/లేక్ వ్యూ తర్వాత భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని రాత్రి 11 గంటలకు బాన్సువాడకు చేరుకుంటుందని తెలిపారు. టికెట్ ధర పెద్దలకు రూ. 1500, పిల్లలకు రూ. 750 ఆన్​లైన్​లో బుక్ చేసుకోవాలని సూచించారు. www.tgsrtcbus.inలో (సర్వీసు నెంబర్: 96668 ) బాన్సువాడ-లక్నవరం అనే రూట్​లో బుకింగ్​ చేసుకోవచ్చన్నారు. లేదా టికెట్స్ బుకింగ్ కోసం గోపికృష్ణ 9063408477ను సంప్రదించాలని డీఎం పేర్కొన్నారు.

    RTC banswada | ఇటీవల బాన్సువాడ నుంచి యాదగిరిగుట్టకు..

    ఇటీవలే బాన్సువాడ నుంచి యాదగిరిగుట్ట (Yadagiri Gutta), స్వర్ణగిరికి (Swarnagiri) డీలక్స్ బస్సు ప్యాకేజీ టూర్​ను విజయవంతం చేశారు. ఈనెల27న డీలక్స్​ బస్సు ప్రయాణికులను తీసుకెళ్లింది. టూర్​ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉండడంతో ప్రయాణికలు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...