ePaper
More
    Homeఅంతర్జాతీయంDonald Trump | అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్​కు భారీ ఊరట

    Donald Trump | అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్​కు భారీ ఊరట

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​కు ఆ దేశ సుప్రీంకోర్టు(US Supreme Court)లో ఊరట లభించింది. ట్రంప్​ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఆయన నిర్ణయాలను పలు రాష్ట్రాల్లోని కోర్టులు అడ్డుకుంటున్నాయి. దీంతో ఆయా న్యాయస్థానాలపై ట్రంప్(Donald Trump)​ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ట్రంప్​కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

    Donald Trump | ఆ అధికారం లేదు..

    అమెరికా అధ్యక్షుడు ఇచ్చే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌(Executive Order)లను నిలిపివేసి జాతీయ స్థాయిలో ప్రభావితం చూపే అధికారం వ్యక్తిగత న్యాయమూర్తులకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ గతంలో ట్రంప్‌ జారీచేసిన ఆదేశాల చట్టబద్ధతపై మాత్రం న్యాయస్థానం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

    Donald Trump | జన్మత: పౌరసత్వం రద్దు

    రెండో సారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్రమ వలసదారులు, విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్​ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పలువురు అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపించారు. అంతేగాకుండా జన్మత: వచ్చే అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేస్తూ గతంలో ఆయన ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్ జారీ చేశారు. అమెరికా చట్టాల ప్రకారం ఎవరైనా ఆ దేశంలో జన్మిస్తే అమెరికా పౌరసత్వం(US citizenship) వస్తోంది. దీంతో అక్రమ వలసదారులు, శరణార్థుల పిల్లలకు పౌరసత్వం లభిస్తుండగా.. దీనిని రద్దు చేస్తూ ట్రంప్​ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ చేసింది. అయితే ట్రంప్​ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో కోర్టులు ఇంజంక్షన్‌ ఆర్డర్లు(Injunction orders) జారీ చేశాయి. వీటిపై ట్రంప్​ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

    More like this

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...

    Hyderabad | జేబీఎస్​ బస్టాండ్​ వద్ద దుకాణాల కూల్చివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలోని జేబీఎస్​ (JBS) వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్తత చోటు...