Shefali Jariwala | తీవ్ర విషాదం.. కాంటాలగా సాంగ్ ఫేమ్ గుండె పోటుతో క‌న్నుమూత‌
Shefali Jariwala | తీవ్ర విషాదం.. కాంటాలగా సాంగ్ ఫేమ్ గుండె పోటుతో క‌న్నుమూత‌

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Shefali Jariwala : బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌(Bollywood film industry)లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఎంతో మంచి భ‌విష్య‌త్ ఉన్న సింగ‌ర్ షెఫాలి జ‌రీవాలా Shefali jeriwala గుండెపోటుతో క‌న్నుమూశారు.

42 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో ఆమె క‌న్నుమూయడం చిత్ర ప‌రిశ్ర‌మ‌ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. శుక్ర‌వారం రాత్రి ఆమెకి గుండెపోటు రావ‌డంతో భ‌ర్త ప‌రాగ్ త్యాగి వెంటనే ఆమెని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, అప్ప‌టికే ఆమె మృతి చెందిన‌ట్టు వైద్యులు ధ్రువీకరించారు. మరణాన్ని నిర్ధారించిన తర్వాత, షెఫాలి మృతదేహాన్ని కూపర్ ఆస్పత్రికి పంపించారు.

Shefali Jariwala : ఆక‌స్మిక మ‌ర‌ణం..

షెఫాలి మరణ వార్తతో చిత్ర ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతికి గురైంది. ఆమె మృతి పై ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. షెఫాలి 2015లో పరాగ్ త్యాగిని Parag Tyagi వివాహం చేసుకోగా, వారిద్ద‌రు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ ఇద్ద‌రిది చూడ‌ముచ్చ‌టైన జంట అని చాలా మంది చెప్పుకొచ్చారు. పరాగ్ త్యాగితో నాచ్ బలియే 5, నాచ్ బలియే 7 అనే డ్యాన్స్ రియాలిటీ షోలు చేసింది షెఫాలి.

ఆ స‌మ‌యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుట్టింది. ఆ త‌ర్వాత పెద్ద‌ల అనుమ‌తితో పెళ్లి చేసుకున్న‌ట్టు స‌మాచారం. ఇక షెఫాలి చివ‌రిగా ముజ్సే షాదీ క‌రోగి అనే చిత్రంలో న‌టించింది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రంలో ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించి అల‌రించింది.

అహ్మదాబాద్‌ Ahmedabad లో జన్మించిన షెఫాలి 2002 సంవత్సరంలో ఆశా పరేఖ్ Asha Parekh చిత్రంలోని కాంటా లగా Kanta laga పాటతో ఒక్కసారిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ పాటను ముజ్సే షాదీ కరోగి చిత్రం కోసం రీమిక్స్ చేయ‌గా, పాటకు యూట్యూబ్ లో అత్యధిక మిలియన్ వ్యూస్ కూడా ల‌భించాయి. నటి ఆకస్మిక మరణం ప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.