West Indies Cricketer | ఆ క్రికెట‌ర్‌పై లైంగిక వేధింపుల కేసు.. ఏకంగా 11 మంది ఫిర్యాదు
West Indies Cricketer | ఆ క్రికెట‌ర్‌పై లైంగిక వేధింపుల కేసు.. ఏకంగా 11 మంది ఫిర్యాదు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: West Indies Cricketer : క్రికెట‌ర్స్ కొన్ని సార్లు లేని పోని వివాదాల‌లో చిక్కుకొని వారి కెరీర్ నాశనం చేసుకుంటూ ఉంటారు. తాజాగా వెస్టిండీస్ West Indies జట్టు ఆటగాడిపై 11 మంది మహిళలు ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

బైర్బెస్‌ Birbhum లోని న్యూ ఆమ్‌స్టర్‌డామ్‌ New Amsterdamలో సదరు క్రికెట‌ర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ 18 ఏళ్ల యువతితో పాటు ఆమె కుటుంబం ఆరోపించింది. ఈ విష‌యంపై గయానా పోలీసులకి ఫిర్యాదు చేసిన‌ట్టు అక్క‌డి మీడియా కూడా పేర్కొంది. 2023లో ఆ మ‌హిళ‌పై ఆ క్రికెట‌ర్ లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ట‌. అయితే కేసుని నీరుగార్చేందుకు ఆ క్రికెట‌ర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

West Indies Cricketer : మైదానంలో రాక్ష‌సుడు..

18 ఏళ్ల యువ‌తి ఫిర్యాదుతో ఆ క్రికెట‌ర్‌పై Cricketer మ‌రికొంత మంది మ‌హిళ‌లు కూడా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఆ క్రికెట‌ర్ పంపిన స్క్రీన్ షాట్స్, వాయిస్ నోట్స్‌తో పాటు పలు ఆధారాలను పోలీసుల‌కు అందించిన‌ట్టు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన కెట్ వెస్టిండీస్ అధ్యక్షుడు కిషోర్ షా.. బాధితులు ఎవ‌రైతే ఉన్నారో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు త‌మ‌కి తెలియ‌ద‌ని, ఈ విష‌యం గురించి ఇప్పుడే ఏమి మాట్లాడ‌లేమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విష‌యం తెలిసిందే. ఇలాంటి సమయంలో స్టార్ క్రికెట‌ర్ గురించి ఇలా ఆరోపణలు బయటకు రావడం హాట్ టాపిక్ అయింది.

ఇక ఆట‌గాడు గురించి గ‌యానా Guyana కి చెందిన వార్తా సంస్థ‌.. మైదానంలో ఓ రాక్ష‌సుడు తిరుగుతున్నాడ‌ని ఓ క‌థ‌నాన్ని ప్రచురించింది. అత‌ను గ‌యానాకు చెందిన ఆటగాడని , గతేడాది జ‌న‌వ‌రిలో బ్రిస్బేన్‌ Brisbane వేదికగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన టెస్టులో కూడా ఆడిన‌ట్టు ఓ లాయ‌ర్ తెలియ‌జేశాడు. ఆస్ట్రేలియా Australia పై విజ‌యం సాధించి స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చిన స‌మ‌యంలో ఆ క్రికెట‌ర్‌కి పెద్ద ఎత్తున ఘ‌న స్వాగ‌తం కూడా లభించిన‌ట్టు స్ప‌ష్టం చేశారు. మ‌రి విచార‌ణ త‌ర్వాత పూర్తి స‌మాచారం బ‌య‌ట‌కు రానుంది.