ePaper
More
    HomeతెలంగాణAnchor Swecha |న్యూస్​ ఛానల్​ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్

    Anchor Swecha |న్యూస్​ ఛానల్​ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Anchor Swecha : టీవీ యాంకర్​(TV anchor) ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ సిటీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

    టీ న్యూస్ ఛానల్​లో పనిచేసే యాంకర్ స్వేచ్చ శుక్రవారం సూసైడ్​ చేసుకుంది. హైదరాబాద్​లోని జవహర్​ నగర్(Jawahar Nagar, Hyderabad)​లో ఉన్న తన ఇంట్లో తనువు చాలించింది. ఘటనా స్థలానికి చిక్కడపల్లి పోలీసులు (Chikkadapalli police) చేరుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుప్రతికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

    Anchor Swecha : న్యూస్​ ఛానల్​లో స్పెషల్​ కరస్పాండెంట్​గా..

    కాగా, స్వేచ్ఛ గత 18 ఏళ్లుగా జర్నలిజం రంగంలో ఉంది. ప్రస్తుతం టీ న్యూస్​ ఛానల్​(T News Channel)లో స్పెషల్​ కరస్పాండెంట్​(special correspondent)గా పనిచేస్తోంది. ఆమె తన తల్లి శ్రీదేవితో కలిసి జవహార్​ నగర్​లో ఉంటోంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జర్నలిజంలో ఎంతో అనుభవం కలిగిన ఈమె సూసైడ్ చేసుకోవడం చర్చకు దారితీసింది.

    More like this

    Bodhan | మృతుల కుటుంబాలకు పరిహారమివ్వాల్సిందే.. వర్షంలోనూ కొనసాగిన నిరసన

    అక్షరటుడే, బోధన్: Bodhan | జీపీ తరపున విధులు నిర్వహిస్తూ సిద్ధాపూర్​లో (Siddhapur) ట్రాక్టర్​ బోల్తా పడి మృతి...

    Hyderabad | హైదరాబాద్​లో మూసీ ఉధృతి.. పలు రోడ్లలో నిలిచిన రాకపోకలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు...

    Rahul Gandhi | రాహుల్ ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాద‌క‌రం.. కాంగ్రెస్ నేత‌పై బీజేపీ విమ‌ర్శ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | ఉప రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి డుమ్మా కొట్టిన కాంగ్రెస్...