Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA
Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA

అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్​ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్​ డాక్టర్లు (junior doctors) సమ్మె బాట పట్టబోతున్నారు. ఈ నెల 30 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. జనవరి నెల నుంచి తమకు ఇవ్వాల్సిన స్టైఫండ్​ చెల్లించాలని, నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ (TJUDA)Telangana Junior Doctors’ Association (TJUDA) డిమాండ్ చేస్తోంది.

Judas strike : డిమాండ్ల సాధనకై..

జూడాల డిమాండ్​లపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈనెల 30 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని, అత్యవసర సేవలు మినహాయించి అన్ని సేవలను బహిష్కరిస్తామని TJUDA హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణ జూడాల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఇసాక్‌ న్యూటన్‌ తెలిపారు. స్టైఫండ్‌ చెల్లింపులో జాప్యం, మౌలిక సదుపాయాలపై నిరసన వ్యక్తం చేశారు.

మెడికల్​ కళాశాలల్లో(medical colleges) బోధనా సిబ్బంది కొరతపై ఇసాక్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్కాలర్‌షిప్‌, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌‍(fee reimbursement) చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆందోళన తెలిపారు. తమ డిమాండ్​లపై తెలంగాణ సర్కారుకు చాలాసార్లు వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేకుండాపోయిందన్నారు. అందుకే సమ్మెకు వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు.