ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా చూడాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్​లో విద్యాశాఖ అధికారులతో (Education Department) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు ఇప్పటినుంచే మెరుగైన బోధన అందించాలన్నారు. మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ హెచ్ఎంలతో క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతూ కార్పోరేట్ బడులకు దీటుగా విద్యాబోధన జరిగేలా చూడాలన్నారు.

    Collector Nizamabad | వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించాలి

    క్లిష్టమైన సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులై ఆర్థిక పరిస్థితి, ఇతర కారణాలవల్ల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకుండా చూడాలన్నారు. ఇప్పటికే అన్ని పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశామన్నారు. నోట్ బుక్కులు 80 శాతం పంపిణీ జరిగిందని, ఒక జత ఏకరూప దుస్తులను అందించినట్లు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన మరమ్మతు పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇంటర్ విద్యాధికారి రవికుమార్, డీఈవో అశోక్ (Deo Ashok), బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు స్రవంతి, రజిని, నాగోరావు తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Minister seethakka | జీజీహెచ్​లో సమస్యలను పరిష్కరిస్తాం

    Latest articles

    CBI Trap | రూ.10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | దేశంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. పైసలు ఇవ్వనిదే పనులు చేయడం...

    Tirumala | ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పిస్తాం : టీటీడీ ఛైర్మన్​ బీఆర్​ నాయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శనం చేసుకుంటారు. గంటల...

    Ex Mla Jeevan reddy | జనహిత యాత్ర కాదు.. జనరహిత యాత్ర : మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan reddy | కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi...

    Srinagar Airport | ఆర్మీ అధికారి వీరంగం.. స్పైస్ జెట్ సిబ్బందిపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Srinagar Airport | ఓ ఆర్మీ అధికారి (Army Officer) రెచ్చిపోయాడు. ఎయిర్​పోర్టులో స్పైస్​...

    More like this