అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | నాగర్కర్నూల్ (Nagar Kurnool) జిల్లా అచ్చంపేటలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ బాలుర హాస్టల్ (Achampet BC Hostel)లో ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు. మహబూబ్‌నగర్ (Mahabubnagar) యూనిట్ ACB అధికారులు హాస్టల్‌లో తనిఖీలు చేశారు.
లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఆడిటర్ సాయంతో హాస్టల్‌లో పరిశీలించారు. ఆహారం నాణ్యత, పరిమాణం, పారిశుధ్య పరిస్థితులు, విద్యార్థుల వివరాలు, హాస్టళ్ల రికార్డులను తనిఖీ చేశారు. సోదాల సమయంలో హాస్టల్‌లో కొన్ని అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. సంబంధిత అధికారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపుతామని అధికారులు తెలిపారు.
ACB Raids | అనేక ఆరోపణలు
రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో (Welfare Hostels) వార్డెన్లపై అనేక ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది వార్డెన్లు స్థానికంగా ఉండరు. విద్యార్థులకు నాసిరకం సరుకులు, కూరగాయలతో వంటలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేగాకుండా విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపి బిల్లులు కాజేస్తారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో హాస్టల్‌లో ఏసీబీ అధికారులు దాడులు చేయడం గమనార్హం. గతంలో ఎప్పుడైనా హాస్టళ్లను సంబంధిత అధికారులు మాత్రమే తనిఖీ చేసేవారు. ప్రస్తుతం ఏసీబీ దాడులు చేయడంతో అక్రమాలకు పాల్పడుతున్న వార్డెన్లలో భయం పట్టుకుంది.