ePaper
More
    HomeజాతీయంGujarat High Court | వర్చువల్ విచారణలో షాకింగ్ ఇన్సిడెంట్​.. వాష్‌రూమ్ నుంచి కోర్టుకు హాజరైన...

    Gujarat High Court | వర్చువల్ విచారణలో షాకింగ్ ఇన్సిడెంట్​.. వాష్‌రూమ్ నుంచి కోర్టుకు హాజరైన వ్యక్తి.. వీడియో వైరల్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gujarat High Court | మన దేశంలో న్యాయవ్యవస్థకు, న్యాయస్థానాలకు ఎంతో గౌరవం ఉంటుంది. కోర్టు ఎదుట హాజరైన వ్యక్తులు న్యాయమూర్తుల ఎదుట ఒద్దికగా ఉంటారు. అలాంటి ఓ వ్యక్తి విచారణకు హాజరైన తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అసలేం జరిగిందంటే..

    కరోనా తదనంతర కాలంలో ఆన్​లైన్​లో కోర్టు విచారణకు (Online court hearing) సర్వసాధారణం అయిపోయాయి. కోర్టు విచారణలు ఆన్‌లైన్‌లో జరుగుతుండడంతో లాయర్లు, వాదులు, ప్రతివాదులు ఎక్కడి నుంచైనా హాజరయ్యే అవకాశం కలిగింది. అయితే ఈ స్వేచ్ఛను ఓ వ్యక్తి దుర్వినియోగం చేశాడు. ఏకంగా వాష్​రూం నుంచే విచారణకు హాజరయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో అందరినీ షాకింగ్​కు గురిచేస్తోంది.

    Gujarat High Court | వైరల్​గా మారిన వీడియో

    గుజరాత్ హైకోర్టు వర్చువల్ ప్రొసీడింగ్స్‌(Virtual proceedings)కు హాజరైన ఒక వ్యక్తి వాష్​రూంలో టాయిలెట్‌పై కూర్చున్నట్లు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సంఘటన జూన్ 20న జరిగినట్లు తెలుస్తోంది. జస్టిస్ నిర్జార్ ఎస్ దేశాయ్ ధర్మాసనం ముందు ఓ వ్యక్తి మెడలో బ్లూటూత్ ఇయర్‌ఫోన్ ధరించి ఉన్న క్లోజప్​లో కనిపించాడు. అనంతరం అతను తన ఫోన్‌ను కాస్త దూరంగా ఉంచాడు. ఇందులో సదరు వ్యక్తి టాయిలెట్‌పై కూర్చున్నట్లు కనిపించింది. వీడియోలో తాను శుభ్రం చేసుకుని, వాష్‌రూమ్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ తర్వాత కొంత సమయం పాటు ఆఫ్​ స్ర్కీన్​లో ఉండి మళ్లీ ఒక గదిలో కనిపించాడు. 

    కాగా.. కోర్టు రికార్డుల ప్రకారం.. సదరు వ్యక్తి తనపై నమోదైన ఎఫ్​ఐఆర్​ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన కేసులో ప్రతివాదిగా హాజరవుతున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇరుపక్షాల మధ్య సామరస్యపూర్వక పరిష్కారం తర్వాత కోర్టు ఎఫ్​ఐఆర్​ను రద్దు చేసింది.

    Gujarat High Court | గతంలో ఒకరికి రూ.50వేల జరిమానా

    ఆన్‌లైన్ కోర్టు కార్యకలాపాల సమయంలో కొందరు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాగే గతంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరైనప్పుడు ఓ న్యాయవాది సిగరెట్ తాగుతూ కనిపించాడు. దీంతో గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) అతనికి రూ.50 వేల జరిమానా విధించినట్లు సమాచారం. అంతేకాకుండా ఢిల్లీ కోర్టు వీడియో కాన్ఫరెన్స్​లోనూ ఓ కేసులో హాజరైనప్పుడు సిగరెట్ తాగుతూ న్యాయవాది కనిపించడంతో సమన్లు ​​జారీ చేసినట్లు తెలుస్తోంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...