అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tenth Supplementary Results | తెలంగాణ(Telangana)లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్రంలో జూన్ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు(Supplementary Exams) నిర్వహించారు. పదో తరగతి(10th Class) వార్షిక పరీక్షల్లో ఫెయిలైన వారిలో 42,832 విద్యార్థులు ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 38,741 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తాజాగా విద్యాశాఖ అధికారులు(Education officers) ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ ఫలితాల్లో 73.35 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 77.08 శాతం, బాలురు 71.05 శాతం పాస్ అయ్యారు.
