ePaper
More
    HomeజాతీయంCM Convoy | సీఎం కాన్వాయ్​ కార్లలో డీజిల్​కు బదులు నీళ్లు.. తర్వాత ఏం జరిగిందంటే..

    CM Convoy | సీఎం కాన్వాయ్​ కార్లలో డీజిల్​కు బదులు నీళ్లు.. తర్వాత ఏం జరిగిందంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Convoy | పెట్రోల్​ బంకుల్లో(Petrol Bunks) జరిగే మోసాలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం. చాలా బంకుల్లో చిప్​లు అమర్చి పెట్రోలు, డీజిల్​ తక్కువగా కొడతారు. అలాగే పలు బంకుల్లో ఇంధనంతో పాటు నీళ్లు కలిసి వస్తుంటాయి. ఇలాంటి ఘటనలు తరుచూ చోటు చేసుకుంటాయి. అలాంటి సమయంలో వాహనదారులు ఆందోళన చేపట్టినా అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి వదిలేస్తారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి కాన్వాయ్​(Chief Minister Convoy)లోని కార్లలో డీజిల్​కు బదులు నీళ్లు నింపారు. దీంతో ఆ వాహనాలు ఆగిపోయాయి.

    మధ్యప్రదేశ్​ సీఎం మోహన్ యాదవ్(Madhya Pradesh CM Mohan Yadav) శుక్రవారం రత్లాంలో జరిగే ఎంపీ సదస్సుకు హాజరు కావాల్సి ఉంది. దీనికోసం గురువారం రాత్రి ఓ బంక్​లో ఆయన కాన్వాయ్​లోని 19 కార్లలో డీజిల్​(Diesel) కొట్టించారు. వాహనాలు కొద్ది దూరం వెళ్లగానే ఆగిపోయాయి. దీంతో అధికారులు ఆందోళన చెందారు. వాహనాల ట్యాంకులను తెరిచి తనిఖీ చేయగా.. డీజిల్​లో నీరు కలిసినట్లు గమనించారు. తర్వాత ఆ వాహనాలను రోడ్డు పక్కకు నెట్టుకుంటూ వెళ్లారు.

    CM Convoy | బంక్​కు సీల్

    అడ్మినిస్ట్రేటివ్ అధికారులు(Administrative officers) రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంధనంలో నీరు కలవడంతో సదరు పెట్రోల్​ బంక్​కు సీల్​ వేశారు. అనంతరం ఇతర వాహనాలను సీఎం కాన్వాయ్​ కోసం ఏర్పాటు చేశారు. డిప్యూటీ తహశీల్దార్ ఆశిష్ ఉపాధ్యాయ్(Deputy Tehsildar Ashish Upadhyay), ఆహార సరఫరా అధికారి మరియు ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. వాహనంలో 20 లీటర్ల డీజిల్ నింపినప్పుడు 10 లీటర్ల నీరు బయటకు వచ్చినట్లు గుర్తించారు. అన్ని వాహనాలలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అదే సమయంలో ఒక ట్రక్కులో కూడా 200 లీటర్ల డీజిల్​ నింపారు. అది కూడా కొద్ది దూరం వెళ్లగానే ఆగిపోయింది. దీంతో అధికారులు బంక్​​ మేనేజర్​(Bunk Manager)కు ఫోన్​ చేయగా.. వర్షానికి డీజిల్​ ట్యాంక్​లోకి నీరు చేరి ఉంటుందని ఆయన చెప్పారు. దీంతో అధికారులు సదరు పెట్రోల్​ బంక్​ను సీజ్​ చేశారు.

    More like this

    Hockey Team | హాకీ జ‌ట్టుకు న‌జ‌రానా.. ఒక్కో స‌భ్యుడికి రూ.3 ల‌క్ష‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Hockey Team | ఆసియా క‌ప్ టైటిల్‌ను గెలుపొందిన పురుషుల హాకీ జ‌ట్టుకు హాకీ...

    Cherlapalli Drugs Case | కూలీగా చేరి డ్రగ్స్​ ముఠా గుట్టురట్టు చేసిన కానిస్టేబుల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ :Cherlapalli | హైదరాబాద్​ నగరంలో మహారాష్ట్ర పోలీసులు(Maharashtra Police) ఇటీవల భారీ డ్రగ్స్​ ముఠా గుట్టు రట్టు...

    Stellant Securities India Ltd | ఐదేళ్లలో లక్షను కోటి చేసిన స్టాక్.. ఈ ఏడాది మే 16 నుంచి నాన్‌ స్టాప్‌ పరుగులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stellant Securities India Ltd | స్టెల్లంట్‌ సెక్యూరిటీస్‌ ఇండియా లిమిటెడ్‌(Stellant Securities India...