ePaper
More
    HomeతెలంగాణPhone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘సిట్’ అధికారుల ముందుకు ఆంధ్రజ్యోతి...

    Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘సిట్’ అధికారుల ముందుకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Phone Tapping Case | ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్​ అధికారులు విచారణ వేగవంతం చేశారు. బీఆర్​ఎస్​ హయాంలో ఎస్​ఐబీ చీఫ్​ ప్రభాకర్​రావు(SIB Chief Prabhakar Rao), ప్రణీత్‌రావు(Praneeth Rao) ఆధ్వర్యంలో వేలాది మంది ఫోన్లు ట్యాప్​ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్​రావుతో పాటు ప్రణీత్​రావును అధికారులు విచారిస్తున్నారు. వారి విచారణలో పలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

    బీఆర్​ఎస్​ హయాంలో ప్రతిపక్ష నాయకులతో పాటు సినీ ప్రముఖులు, జడ్జీలు, వ్యాపారులు, జర్నలిస్ట్​లు, పలువురు అధికారుల ఫోన్లను ట్యాప్​ చేశారు. బీఆర్​ఎస్​ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం గమనార్హం. ఈ క్రమంలో సిట్​ అధికారులు ఫోన్​ ట్యాపింగ్​కు గురైన బాధితుల స్టేట్​మెంట్​ కూడా రికార్డు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ(Andhra Jyothi MD Radhakrishna) వాంగ్మూలం సేకరించారు. ఏసీపీ వెంకటగిరి(ACP Venkatagiri) గంట పాటు రాధాకృష్ణ స్టేట్మెంట్ రికార్డు చేశారు.

    Phone Tapping Case | చర్యలుంటాయా!

    ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో సిట్​ అధికారులు(Sit Officers) దూకుడు పెంచారు. నిందితులను విచారించడంతో పాటు బాధితుల స్టేట్​మెంట్​ రికార్డు చేస్తున్నారు. కాంగ్రెస్​కు చెందిన 200 మంది నాయకుల ఫోన్లు ట్యాప్​ చేసినట్లు సిట్​ గుర్తించింది. అయితే బాధితులు అందరూ కూడా కేసీఆర్(KCR)​, కేటీఆర్(KTR) చెబితేనే తమ ఫోన్లు ట్యాప్​ చేశారని చెబుతున్నారు. మరోవైపు ప్రధాన నిందితుడు ప్రభాకర్​ రావు డీజీపీ ఆదేశాల మేరకు ట్యాపింగ్​ చేసినట్లు తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు గతంలో పని చేసిన డీజీపీని కూడా సిట్​ అధికారులు విచారించే అవకాశం ఉంది.

    ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)​ వెనక ఉన్నవారిపై చర్యలు తీసుకుంటారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన విద్యుత్​ కమిషన్​ విచారణ ముందుకు సాగడం లేదు. కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission)​ నివేదిక రాలేదు. ఫార్ములా ఈ కార్​ రేస్​ కేసు విచారణ కూడా నెలలుగా కొనసాగుతోంది. దీంతో ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో కేసీఆర్​, కేటీఆర్​ను అరెస్ట్​ చేయాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. లేదంటే కేసును సీబీఐ(CBI)కి అప్పగించాలని డిమాండ్​ చేస్తున్నారు. మరి ఈ కేసులో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

    More like this

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...