ICC New Rule
ICC New Rules | ఐసీసీ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కొత్త రూల్స్ ఇవే.. స్టాప్‌ క్లాక్ రూల్ ఏంటి?

అక్షరటుడే, వెబ్​డెస్క్: ICC New Rules | అంతర్జాతీయ క్రికెట్ మండలి టెస్ట్ క్రికెట్‌తో పాటు ఇతర ఫార్మాట్లకి సంబంధించి కొన్ని కీలక మార్పులను ప్రకటించింది. అయితే ఈ మార్పులలో ముఖ్యంగా టెస్ట్ క్రికెట్(Test Cricket)పై వారు ఫోక‌స్ చేయ‌డం గమనార్హం. గత వారం వన్డేల్లో ఒకే బంతి, బౌండరీ క్యాచ్‌లు, కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ అంశాలపై రూల్స్‌ను సవరించ‌డం మనం చూశాం. ఇక ఇప్పుడు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఐసీసీ. టెస్ట్ ఫార్మాట్‌లో స్టాప్ క్లాక్(Test Format Stop Clock) అమలుతో పాటు, డీఆర్ఎస్ విధానంలో కీలక మార్పులు చేసి, మూడు ఫార్మాట్‌లకూ వర్తించే విధంగా ఐసీసీ కొత్త రూల్స్‌(ICC New Rules)ను రూపొందించింది.

ICC New Rules | ఇవే కొత్త రూల్స్..

ఓవర్స్‌ మధ్య సమయాన్ని నియంత్రించేందుకు స్టాప్ క్లాక్​ను పరిచయం చేశారు. ఒక రోజులో 90 ఓవర్లు పూర్తి చేయాల్సి ఉన్నా అలా జరగడం లేదు. అందుకే ఇక నుంచి ఓవర్‌ పూర్తయిన 60 సెకన్లలోపే తర్వాతి ఓవర్‌ను మొదలెట్టాలని తెలిపారు. అలా జ‌ర‌గ‌ని ప‌క్షంలో ఫీల్డింగ్‌ జట్టు కెప్టెన్‌(Fielding Team Captain)ను అంపైర్లు రెండుసార్లు హెచ్చరించ‌డం జ‌రుగుతుంది. మూడోసారి రిపీట్‌ అయితే మాత్రం పెనాల్టీ కింద ప్రత్యర్థి జట్టుకు అదనంగా ఐదు పరుగులను కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని తెలియ‌జేశారు. గేమ్‌లో 80వ ఓవ‌ర్ వ‌ర‌కు ఎన్ని సార్లు ఇలా చేస్తే అన్ని పెనాల్టీ ర‌న్స్ విధిస్తారు.

డబ్ల్యూటీసీ WTC కొత్త సీజన్‌ (2025-2027) నుంచే ఇది అమల్లోకి వస్తుందని ఐసీసీ స్ప‌ష్టం చేసింది. నిజానికి వన్డే, టీ20ల్లో గతేడాది జూన్‌ ఒకటి నుంచే ఈ స్టాప్‌ క్లాక్‌ రూల్‌ కొనసాగుతుండ‌గా, కాస్త లేట్‌గా టెస్ట్‌ల్లోకి ఈ రూల్ తీసుకొచ్చారు. ప్ర‌స్తుతం బంతికి బౌల‌ర్స్(Bowlers) లాలాజలం పూయ‌కూడ‌ద‌నే రూల్ ఉంది. అలా పూస్తే బంతిని మార్చేవారు. కానీ ఇప్పుడు లాలాజలం పూసిన బంతిని మార్చ‌రు. ఎప్పుడైతే బంతి దెబ్బ‌తింటుందో అప్పుడే మారుస్తారు. ఇక వికెట్‌ కీపర్ క్యాచ్(Wicketkeeper Catch) ప‌ట్టిన స‌మ‌యంలో బ్యాట‌ర్ రివ్యూకి వెళ్లిన‌ప్పుడు దానిని క్లియ‌ర్‌గా చెక్ చేస్తారు. క్యాచ్ కాదని తెలిసిన‌ప్పుడు ఎల్బీ కూడా చెక్ చేస్తారు. అప్పుడు ఔట్ అని తేలితే బ్యాట‌ర్ అంపైర్‌ కాల్‌ ప్రకారం పెవిలియన్‌కు చేరాల్సిందే. ఇక బ్యాట‌ర్ కావాల‌ని క్రీజులో బ్యాట్ పెట్ట‌కుండా సింగిల్ కోసం ప‌రుగెత్తిన‌ప్పుడు ఐదు ప‌రుగుల పెనాల్టీ విధిస్తారు. అనంత‌రం ఏ బ్యాట‌ర్ బంతిని ఎదుర్కోవాల‌నేది ఫీల్డింగ్ జ‌ట్టు(Fielding Team) డిసైడ్ చేస్తుంది. ఇక నోబాల్ క్యాచ్ విష‌యంలో స‌రిగ్గా ప‌ట్టాడా లేద‌ని రివ్యూ చేసి మంచిగా ప‌డితే బ్యాటింగ్ జ‌ట్టుకి నోబాల్ ర‌న్ వ‌స్తుంది. క్యాచ్ విష‌యంలో తేడా ఉంటే వారు ఎన్ని ప‌రుగులు తీస్తే అన్ని ప‌రుగులు ఇస్తారు.