Ram Charan
Ram Charan | రామ్ చ‌ర‌ణ్ చేతికి ఆ క‌ట్టు ఏంటి.. షూటింగ్‌లో గాయ‌ప‌డ్డాడా..!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ram Charan | మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్​ చ‌రణ్ ప్ర‌స్తుతం పెద్ది సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అయితే తెలంగాణ ప్ర‌భుత్వం(Telangana Government) ఆహ్వానం మేర‌కు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం(Anti-Drug Day)లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్ర‌మంలో పాల్గొన్నారు. రామ్ చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ పాల్గొన్నారు. అయితే కార్య‌క్ర‌మం అంతా ముగిశాక అంద‌రూ ప్ర‌తిజ్ఞ చేస్తున్న స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ కాస్త ఇబ్బందిగా ఫీల‌య్యాడు. త‌న చేతిని పైకి లేప‌లేక‌పోయాడు. అదే స‌మయంలో అత‌ని చేతికి క‌ట్టు కూడా క‌నిపించింది. దీంతో రామ్ చ‌ర‌ణ్(Ram Charan) పెద్ది సినిమా షూటింగ్‌లో గాయ‌పడ్డాడేమో అని అంద‌రూ ముచ్చ‌టించుకుంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Ram Charan | చేతికి ఏమైంది..

ఇక ఈ కార్య‌క్ర‌మంలో రామ్ చ‌రణ్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నాకు చిన్నప్పుడు స్కూల్​లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలకు వెళ్లిన జ్ఞాపకం ఉంది. ఈరోజు మీ అందరినీ చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి. డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు వ్యక్తిని కాదు, కుటుంబాలను, సమాజాన్ని నాశనం చేస్తాయి. అప్ప‌ట్లో స్కూల్స్ వెలుపల చాక్లెట్లు, గోలి సోడాలు దొరికేవి. కానీ ఇప్పుడు అక్క‌డ మాదకద్రవ్యాలు(Drugs) అమ్ముతున్నారని తెలిసి షాక్ అయ్యాను. అప్పుడు నేను తండ్రిని కాదు, కానీ ఇప్పుడు తండ్రి ప్ర‌మోష‌న్ పొందాను. నా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు బాధగా ఉంటుంది.

హై అనేది ఒక్క మత్తులో కాదు.. మంచి మార్కులు తెచ్చుకున్నపుడు, సినిమా హిట్ అయినపుడు, ఫ్యామిలీతో గడిపే సమయంలోనూ ఉంటుంది. మాదకద్రవ్యాలు వాడకుండానే మనం హై కావాలి. ఈ డ్ర‌గ్స్ నిర్మూల‌న కార్య‌క్ర‌మం(Drug eradication program)లో తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాను. మనం అందరం కలిసి ఒక్కో సైనికుడిలా మారితే, డ్రగ్స్‌ను నిర్మూలించవచ్చు అని స్ప‌ష్టం చేశారు రామ్ చ‌ర‌ణ్‌. ఇక దిల్ రాజు(Dil Raju) మాట్లాడుతూ.. మలయాళ పరిశ్రమ మాదకద్రవ్యాలు తీసుకున్నవారిని సినిమా ఇండ‌స్ట్రీ నుండి బ‌హిష్క‌రించాల‌నే నిర్ణయం తీసుకుంది. అలాంటి మార్గదర్శకాలు మన తెలుగు పరిశ్రమలో కూడా తీసుకొస్తాం అని దిల్ రాజు అన్నారు.