ePaper
More
    HomeజాతీయంRailway Passengers | ఆర్వోబీ వద్ద విరిగిన క్లస్టర్​.. నిలిచిపోయిన పలు రైళ్లు

    Railway Passengers | ఆర్వోబీ వద్ద విరిగిన క్లస్టర్​.. నిలిచిపోయిన పలు రైళ్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | పెద్దపల్లి జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్​ బ్రిడ్జి క్లస్టర్(Railway Overbridge Cluster)​ విరిగిపోయింది. అయితే అది పట్టాలపై పడి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది. కానీ సిబ్బంది ముందుగానే గుర్తించడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు.

    పెద్దపల్లి రైల్వే జంక్షన్(Peddapalli Railway Junction)​ సమీపంలో కూనారం వద్ద ఆర్​వోబీ నిర్మిస్తున్నారు. రూ.119.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. వేసవి లోపు పనులు పూర్తి చేయాలని గతంలో కలెక్టర్​ ఆదేశించిన ఇంకా పూర్తి కాలేదు. అయితే ప్రస్తుతం పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం వంతెన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన క్లస్టర్​ విరిగిపోయింది. ఈ క్లస్టర్ పూర్తిగా విరిగి గడ్డర్లు రైలు పట్టాలపై(Train Tracks) పడితే పెద్ద ప్రమాదం జరిగేది. అయితే ముందుగానే గుర్తించిన అధికారులు దానికి మరమ్మతులు చేస్తున్నారు.

    Railway Passengers | రైళ్ల రాకపోకలకు అంతరాయం

    క్లస్టర్​ మరమ్మతుల కారణంగా అధికారులు ముందు జాగ్రత్తగా పలు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కాజీపేట నుంచి బల్లార్షా, బల్లార్షా నుంచి కాజీపేట వైపు నడిచే రైళ్లను ఆపేశారు. దీంతో ఆయా స్టేషన్​లలో గంటల తరబడి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొలనూర్ రైల్వే స్టేషన్(Kolanur Railway Station) లో 22631 అనువ్రత్ ఏసీ సూపర్ ఫాస్ట్, పోత్కపల్లిలో 20805 పి సూపర్ ఫాస్ట్, బిసుగిరి షరీఫ్ రైల్వే స్టేషన్​లో 12621 తమిళనాడు సూపర్ ఫాస్ట్, జమ్మికుంట రైల్వే స్టేషన్​లో 12723 తెలంగాణ సూపర్ ఫాస్ట్, 22691 బెంగళూరు రాజధాని సూపర్ ఫాస్ట్, ఉప్పల్ రైల్వే స్టేషన్​లో 17011 కాగజ్ నగర్ ఇంటర్ సిటీ, హసన్ పర్తి రైల్వే స్టేషన్​లో 22648 కోర్బా బై వీక్లీ సూపర్ ఫాస్ట్, రామగుండం రైల్వే స్టేషన్​లో 20101 వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. మరమ్మతులు పూర్తయ్యాక ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు అనుమతించనున్నారు.

    సిర్పూర్ వైపు వెళ్ళే రామగిరి మెము 17003 ఎక్స్ ప్రెస్ పుష్ పుల్ రైలును ఓదెల రైల్వే స్టేషన్ లో గత 4 గంటలుగా నిలిపారు.ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...