ePaper
More
    Homeబిజినెస్​Stock Market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    Stock Market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) వరుసగా నాలుగో రోజూ లాభాల బాటలో సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 19 పాయింట్ల స్వల్ప లాభంతో సెన్సెక్స్‌, 27 పాయింట్ల లాభంతో నిఫ్టీ(Nifty) ప్రారంభమయ్యాయి. ప్రథమార్థంలో తొలి రెండుగంటలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 156 పాయింట్ల లాభంతో 83,912 వద్ద, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 25,601 వద్ద కొనసాగుతున్నాయి. శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత బలపడింది. త్వరలోనే భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌ కుదిరే అవకాశాలున్నాయని ట్రంప్‌ ప్రకటించడం మార్కెట్లకు సానుకూలాంశం.

    Stock Market | పవర్‌, పీఎస్‌యూ బ్యాంక్‌ స్టాక్స్‌లో ర్యాలీ

    పవర్‌(Power), పీఎస్‌యూ బ్యాంక్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ సెక్టార్ల స్టాక్స్‌ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. బీఎస్‌ఈలో పవర్‌ ఇండెక్స్‌ 1.43 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌(PSU bank index) 1.22 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 1.040.65 శాతం, పీఎస్‌యూ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ 0.87 శాతం, ఎనర్జీ ఇండెక్స్‌ 0.86 శాతం, ఇన్‌ఫ్రా 0.83 శాతం లాభాలతో ఉన్నాయి. రియాలిటీ(Realty) ఇండెక్స్‌ 0.6 శాతం నష్టంతో ఉంది. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌(Small cap index) 0.61 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.56 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.32 శాతం లాభాలతో కదలాడుతున్నాయి.

    Top gainers: బీఎస్‌ఈ(BSE)లో 19 కంపెనీలు లాభాలతో, 11 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. ఆసియా పెయింట్‌(Asia paint) 1.61 శాతం, పవర్‌గ్రిడ్‌1.58 శాతం, అదానీ పోర్ట్స్‌ 1.30 శాతం, రిలయన్స్‌ 1.12 శాతం, ఎల్‌అండ్‌టీ 1.01 శాతం లాభాలతో ఉన్నాయి.

    Top Losers: ఎటర్నల్‌ 1.15 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌(Bajaj finserv) 1.08 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.75 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.74 శాతం, టైటాన్‌ 0.72 శాతం నష్టాలతో ఉన్నాయి.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...