ePaper
More
    Homeటెక్నాలజీRedmi Pad 2 | భారీ బ్యాటరీతో రెడ్‌మీ ప్యాడ్‌ 2.. ధర రూ. 18...

    Redmi Pad 2 | భారీ బ్యాటరీతో రెడ్‌మీ ప్యాడ్‌ 2.. ధర రూ. 18 వేలలోపే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Redmi Pad 2 | షావోమీ(Xiaomi)కి చెందిన సబ్‌బ్రాండ్‌ రెడ్‌మీ(Redmi) భారతదేశ మార్కెట్‌లోకి కొత్త ప్యాడ్‌(Pad)ను తీసుకువచ్చింది. రెడ్‌మీ ప్యాడ్‌ 2 పేరిట తీసుకువచ్చిన దీని బ్యాటరీ సామర్థ్యం 9000 mAh కావడం గమనార్హం. స్మార్ట్‌ పెన్‌, గూగుల్‌ సర్కిల్‌ టు సెర్చ్‌, జెమినీ ఏఐ వంటి ఫీచర్లు ఉన్నాయి. మిడ్ రేంజ్‌లో క్వాలిటీ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. కంపెనీ అధికారిక ఇ -స్టోర్‌తో పాటు Flipkart, అమెజాన్‌, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్‌ స్టోర్లలోనూ అందుబాటులోకి వచ్చిన ఈ ప్యాడ్‌ స్పెసిఫికేషన్స్‌ చూసేద్దామా..

    డిస్‌ప్లే:11.5 అంగుళాల 2.5K రిజల్యూషన్, 10 బిట్‌ డిస్‌ప్లేతో 90 Hz రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది. 600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉంది. వెట్‌ టచ్‌ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంది.

    ప్రాసెసర్‌:MediaTek Helio G100 Ultra చిప్‌సెట్‌ను అమర్చారు.

    ఆపరేటింగ్‌ సిస్టమ్‌:ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత హైపర్‌ ఓఎస్‌ 2.0తో పనిచేస్తుంది.

    కెమెరా:వెనకవైపు 8 MP కెమెరా, ముందువైపు 5 MP కెమెరా అమర్చారు.

    బ్యాటరీ:9000 mAh బ్యాటరీ కలిగి ఉంది. ఇది 18w ఫాస్ట్‌ చార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.
    ఈ టాబ్లెట్ 4G మద్దతు, Wi-Fi, బ్లూటూత్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కలిగి ఉంది.

    వేరియంట్స్‌:వైఫై ఓన్లీ మోడల్‌ 4 జీGB + 128 GB వేరియంట్ ధర రూ.13,999.
    వైఫై+ సెల్యులార్‌ మోడల్‌ 6 GB + 128 GB వేరియంట్‌ ధర రూ.15,999. ఇందులో 8 GB+ 256 GB వేరియంట్‌ ధర రూ. 17,999.

    కలర్స్‌:బ్లూ, గ్రే రంగుల్లో లభిస్తుంది.

    కార్డ్‌ ఆఫర్స్‌:SBI, ఫెడరల్ బ్యాంకు క్రెడిట్ కార్డులపై వెయ్యి రూపాయల తక్షణ డిస్కౌంట్‌ వర్తిస్తుంది. Flipkart ఆక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు పై 5 శాతం క్యాష్ బ్యాక్, ఐసీఐసీఐ అమెజాన్‌ పే క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేసేవారికి 3 నుంచి 5 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది.

    More like this

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...