ePaper
More
    HomeసినిమాDil Raju | దిల్‌రాజు చెప్పిన‌ట్లు చేయడం సాధ్య‌మేనా?డ్ర‌గ్స్ తీసుకుంటే నిషేధిస్తారా?

    Dil Raju | దిల్‌రాజు చెప్పిన‌ట్లు చేయడం సాధ్య‌మేనా?డ్ర‌గ్స్ తీసుకుంటే నిషేధిస్తారా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Dil Raju | డ్ర‌గ్స్ తీసుకునే వారిని సినిమా ఇండ‌స్ట్రీ నుంచి నిషేధిస్తారా? అది సాధ్య‌మ‌య్యే ప‌నేనా? సినీ ఇండస్ట్రీ అంటేనే హైఫై లైఫ్‌, ప‌బ్స్‌, డ్ర‌గ్స్‌.. అదో గ‌”మ్మ‌త్త”యిన ప్ర‌పంచం. డ్రగ్స్ కేసులు బ‌య‌ట‌కు వ‌స్తే చాలు.. అందులో సినీ ప‌రిశ్ర‌మ‌(Film Industry)కు చెందిన వారు ఎవ‌రో ఒక‌రు బ‌య‌ట‌కు రావ‌డం సాధార‌ణ‌మై పోయింది. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే కాదు, మాలీవుడ్‌, టాలీవుడ్, కోలీవుడ్‌, బాలీవుడ్‌లో ఇప్ప‌టికే చాలా మంది డ్ర‌గ్స్(Drugs) తీసుకుంటూ దొరికిపోయారు. సినీ ప‌రిశ్ర‌మ అంటేనే డ్ర‌గ్స్‌, డ్ర‌గ్స్ అంటేనే సినీ ఇండ‌స్ట్రీ అన్నంతగా పెన‌వేసుకుపోయిన ఈ బంధాన్ని ఎలా విడ‌దీస్తారన్న‌దే ఇప్పుడు అంద‌రి మ‌దిని తొలుస్తున్న ప్ర‌శ్న‌లు.

    Dil Raju | దిల్ రాజు ఏం చెప్పారంటే..

    డ్ర‌గ్స్ తీసుకునే వారిని తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ నుంచి నిషేధిస్తామ‌ని ప్ర‌ముఖ నిర్మాత‌, ఫిలిం డెవ‌ల‌ప్‌మెంట్ కౌన్సిల్ చైర్మ‌న్‌ దిల్ రాజు(Film Development Council Chairman Dil Raju) అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైద‌రాబాద్ శిల్పాక‌ళా వేదిక‌(Hyderabad Art Gallery)లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, హీరోలు విజయ్ దేవరకొండ, రామ్ చరణ్‌తో క‌లిసి దిల్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మలయాళ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ తీసుకున్న వారిని బహిష్కరించే నిర్ణయం తీసుకున్నారని, ఇక తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోనూ ఆ నిర్ణ‌యాన్ని అమ‌లు చేయాల‌ని కోరారు. “అక్కడ ఎవరైనా డ్రగ్స్‌ తీసుకున్నట్లు తేలితే, వారిని పరిశ్రమ నుంచి బహిష్కరిస్తారు. తెలంగాణ(Telangana) ఎఫ్‌డీసీ తరపున తెలుగు చిత్ర పరిశ్రమ తరపున నేను కోరేది ఒక్కటే. మన దగ్గర కూడా అలాంటి సంఘటనలు జరిగితే సంబంధిత వ్యక్తులను ఇండస్ట్రీలో అడుగు పెట్టకుండా నిషేధించాలి. అప్పుడే సమాజానికి బలమైన సందేశం వెళుతుంది” అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని చిత్ర పరిశ్రమ పెద్దలతో చర్చించి, తెలుగు సినిమాల్లో కూడా ఈ నిబంధన పాటించేలా చర్యలు తీసుకుంటామని, ఇది మనందరి కర్తవ్యమని దిల్ రాజు పేర్కొన్నారు.

    Dil Raju | డ్ర‌గ్స్ మ‌త్తులో ప్ర‌ముఖులు?

    సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఎప్ప‌టి నుంచో కలకలం రేపుతోంది. ద‌క్షిణాదిలో వెలుగు చూస్తున్న డ్ర‌గ్స్ కేసుల్లో బ‌య‌ట ప‌డుతున్న నిందితుల్లో సినిమా వ్య‌క్తులు ఉండ‌డం సాధార‌ణంగా మారింది. మాదక ద్ర‌వ్యాల కేసులో ఇటీవ‌లే తెలుగుతో పాటు త‌మిళ సినిమాల్లో న‌టిస్తున్న శ్రీ‌రామ్(Hero Sriram) అలియాస్ శ్రీ‌కాంత్ అరెస్ట‌య్యారు. విచారణలో మరికొందరు తమిళ నటుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో మరో నటుడు కృష్ణ(Actor Krishna) పై కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

    Dil Raju | టాలీవుడ్‌ను షేక్ చేసిన విచార‌ణ‌

    ఇక‌, టాలీవుడ్ లో డ్ర‌గ్స్ వాడ‌కం నిత్య‌కృత్యంగా మారింది. ఇలాంటివి త‌ర‌చూ వెలుగు చూడ‌డం, పోలీసులు హ‌డావుడి చేయ‌డం, ఆ త‌ర్వాత వ‌దిలేయ‌డం కామ‌న్ అయిపోయింది. బీఆర్ ఎస్(BRS) హ‌యాంలో వెలుగు చూసిన డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం తెలుగు ఇండస్ట్రీని కుదిపేసింది. అప్ప‌ట్లో విచార‌ణ‌ల పేరిట హ‌డావుడి చేసిన ప్ర‌భుత్వం.. ఆ త‌ర్వాత ఏమైందో కానీ దాన్ని అట‌కెక్కించింది. నాడు అనేక మంది సినీ ప్ర‌ముఖుల‌ను నార్కోటిక్స్(Narcotics) అధికారులతో పాటు ఈడీ విచారించ‌డం సంచ‌ల‌నం రేపింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌, హీరో ర‌వితేజ, రాణా, త‌రుణ్‌, త‌నీష్‌, న‌వ‌దీప్‌, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, చార్మి, ముమైత్ ఖాన్‌, సుబ్బ‌రాజు, త‌దిత‌రుల‌ను పిలిచి విచారించారు. డ్ర‌గ్ పెడ్ల‌ర్ కెల్విన్ ఫోన్‌(Drug peddler Kelvin phone)లో దొరికిన స‌మాచారం ఆధారంగా వీరంద‌రికీ నోటీసులు జారీ చేసి, బ్ల‌డ్ శాంపిల్స్ సేక‌రించి ప‌రీక్ష‌ల‌కు పంపించారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో కానీ ఈ కేసును అట‌కెక్కించారు.

    Dil Raju | మిగ‌తా సినీ ప‌రిశ్ర‌మ‌ల్లోనూ..

    తెలుగు సినిమా ఇండ‌స్ట్రీయే కాదు, మిగ‌తా బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లోనూ డ్ర‌గ్స్ వాడ‌కం కామ‌నై పోయింది. అమీర్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ డ్ర‌గ్స్ తీసుకుంటూ ప‌ట్ట‌బ‌డ్డట్లు అప్ప‌ట్లో అత‌డ్ని అదుపులోకి తీసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇక‌, సుశాంత్ రాజ్‌పుత్(Sushant Rajput) ఆత్మ‌హ‌త్య వెనుక డ్ర‌గ్స్ వ్య‌వ‌హారమే ఉన్న‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసు తీగ లాగితే రియా చ‌క్ర‌వ‌ర్తి, శ్ర‌ద్ధ క‌పూర్‌, దీపికా ప‌దుకొనే వంటి ప్ర‌ముఖుల పేర్లు బ‌య‌ట‌కొచ్చాయి. వారిని పిలిచి విచారించారు కూడా. ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌ముఖ హీరోలు కూడా ఉన్నార‌ని, వారిని కూడా విచారిస్తార‌ని వార్త‌లొచ్చినా, ఆ త‌ర్వాత ఎలాంటి క‌ద‌లిక లేకుండా పోయింది. ఇక మ‌ళ‌యాల సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎప్ప‌టి నుంచో డ్ర‌గ్స్ వినియోగిస్తున్నారు. త‌ర‌చూ ఎవ‌రో ఒక‌రి పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉన్నాయి. మలయాళ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం గురించి గ‌తంలోనే నిర్మాత, నటి సాండ్రా థామస్(Actress Sandra Thomas) కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపింది. సినీ సెట్స్‌లో డ్రగ్స్ వాడకం సర్వసాధారణమ‌ని, దీని కోసం ప్రత్యేక బడ్జెట్, ప్రత్యేక గదులు కూడా ఉంటాయ‌ని చెప్పారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇంత‌లా పెన‌వేసుకుపోయిన డ్ర‌గ్స్‌ను నియంత్రించ‌డం, వాటిని తీసుకునే వారిని నిషేధిస్తామని దిల్ రాజు చెబుతున్న‌ట్లు సాధ్య‌మేనా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 17 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    More like this

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 17 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....