ePaper
More
    HomeతెలంగాణRain Alert | రాష్ట్రానికి వర్ష సూచన

    Rain Alert | రాష్ట్రానికి వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం (Rain) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. అయితే శుక్రవారం వానలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

    పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మధ్యాహ్నం, సాయంత్రం వాన పడే ఛాన్స్​ ఉంది. మిగతా ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతాయి. హైదరాబాద్ (Hyderabad)​లో చెదురుమొదురు వర్షాలు కురుస్తాయి. రానున్న మూడు నాలుగు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు తెలిపారు. జులై 1 నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

    కాగా రాష్ట్రంలో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతుండటంతో రైతులు పొలం పనులు ప్రారంభించారు. ఇప్పటికే ప్రభుత్వం రైతు భరోసా(Rythu Bharosa) విడుదల చేయడంతో ఎరువులు కొనుగోలు చేసిన రైతులు.. వర్షాలతో భూములను సిద్ధం చేసుకుంటున్నారు. పలువురు అన్నదాతలు వరినాట్లు ప్రారంభించారు. మరో భారీ వర్షం పడితే వరి నాట్లు మరింత జోరందుకోనున్నాయి.

    More like this

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సైపై వేటు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...