ePaper
More
    HomeతెలంగాణIndira Canteens | ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇకపై టిఫిన్ కూడా..

    Indira Canteens | ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇకపై టిఫిన్ కూడా..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Indira Canteens : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కేవలం రూ.5 కే భోజనం పెడుతూ పేదల కడుపు నింపుతున్న అన్నపూర్ణ భోజన కేంద్రాల (Annapurna Food Centres) పేరు మారబోతోంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ (GHMC Standing Committee) కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అన్నపూర్ణ ఫుడ్​ కేంద్రాలను ఇందిర క్యాంటీన్లుగా పేరు మార్చాలని స్టాండింగ్ కమిటీ ముక్త కంఠంతో ఆమోదం తెలిపింది.

    Indira Canteens : ఇకపై పర్మినెంట్​ ప్లేస్..

    అన్నపూర్ణ భోజన కేంద్రాల(Annapurna Food Centres) లో ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం మాత్రమే పెట్టేవారు. పేరు మారిన ఇందిరా క్యాంటీన్లలో ఇకపై రూ. 5 భోజనంతో పాటు మార్నింగ్​ బ్రేక్​ఫాస్ట్ (టిఫిన్) breakfast (tiffin) అందుబాటులో ఉండబోతోంది. దీనికితోడు భోజన కేంద్రాలకు శాశ్వత స్థలాలు కేటాయించి, అక్కడ షెడ్​లు నిర్మించాలని కమిటీ (GHMC Standing Committee) ఆమోదం తెలపడం విశేషం.

    Indira Canteens : పే అండ్​ యూజ్​​ పద్ధతితో..

    విశ్వనగరం హైదరాబాద్(Hyderabad)​లో ప్రధాన సమస్య టాయిలెట్స్ నిర్వహణ. ప్రస్తుతం ఉన్నవి పూర్తిస్థాయిలో శుభ్రంగా లేకపోవడంతో ప్రజలు అందులోకి వెళ్లడానికి జంకుతున్నారు. ఇకపై ఈ పరిస్థితి మారబోతోంది. వాటిని ఆధునికీకరించి పే అండ్ యూజ్ (pay and use) పద్ధతిలో నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ (GHMC Standing Committee) ఆమోదం తెలిపింది.

    More like this

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...

    Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి

    అక్షరటుడే, కోటగిరి: Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి గిరిజనులంతా ఐక్యతతో ముందుకు సాగి, సేవాలాల్‌ బాటలో...