PADMASHALI SANGHAM
PADMASHALI SANGHAM | పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడిగా చంద్రశేఖర్

అక్షరటుడే నిజాంసాగర్: PADMASHALI SANGHAM | పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడిగా గాజుల చంద్రశేఖర్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షులతో పాటు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాన్సువాడ మున్సిపల్ (Banswada municipality) ఛైర్మన్ జంగం గంగాధర్, గెంట్యాల బాలకృష్ణ, చేనేత సహకార సంఘం (Handloom Cooperative Society) అధ్యక్షుడు సన్నపుల కృష్ణ, డాక్టర్ రాజు బిచ్కుంద డివిజన్ సంఘం అధ్యక్షుడు సమక్షమంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

అధ్యక్షులతో పాటు మండల కార్యదర్శిగా చిట్యాల నారాయణ, ఉపాధ్యక్షులుగా బండారి రాజు, జ్ఞానేశ్వర్ కోశాధికారిగా మారనారాయణ, సంయుక్త కార్యదర్శిగా గంగాధర్, సభ్యులుగా చిట్యాల రామకృష్ణ, మార అంజయ్య, మార వెంకయ్య, రచ్చ రాములు, గాజుల రఘును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.