ePaper
More
    HomeసినిమాActress Meena | బీజేపీలోకి సినీ నటి మీనా!

    Actress Meena | బీజేపీలోకి సినీ నటి మీనా!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : actress Meena | తమిళనాడు (Tamil Nadu)లో ఎలాగైనా బలపడాలని బీజేపీ (BJP) భావిస్తోంది. ఇందులో భాగంగా అన్నాడీఎంకే(AIADMK) పార్టీతో పొత్తు పెట్టుకుంది.

    అంతేగాకుండా పార్టీ అధ్యక్ష బాధ్యతలు సైతం అన్నామలై నుంచి నైనార్​ నాగేంద్రన్​కు అప్పగించింది. తమిళనాడు 2026 మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అప్పటిలోగా పార్టీని బలోపేతం చేసి, వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించే దిశగా కాషాయదళం పావులు కదుపుతోంది. ఇప్పటికే అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోగా.. పలు చిన్న పార్టీలతో కూడా జత కడుతోంది.

    Actress Meena | ప్రముఖులను టార్గెట్ చేసి..

    పలువురు సినీ ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా బలపడాలని కమలం పార్టీ యోచిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ నటీ మీనా (Meena) తమిళనాడు బీజేపీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆమె ఇటీవల ఉపరాష్ట్రపతి ధన్​ఖడ్ (Vice President Dhankhar)​ను కలిశారు. పార్టీలో చేరికపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

    కాగా.. తమిళనాట ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఖుష్బూ, నమిత, శరత్‌కుమార్‌ వంటి సినీ ప్రముఖులను పార్టీలో చేర్చుకుంది. తాజాగా మీనాను పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తోంది. ఆమె పార్టీలో చేరగానే కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.

    తమిళనాడులో ఎలాగైనా పాగ వేయాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఇప్పటికే ఎన్​డీఏ భాగస్వామి అయినా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్ (Pavan Kalyan)​ను రంగంలోకి దింపింది. ఇటీవల తమిళనాడులోని మధురైలో జరిగిన మురుగన్​ భక్తుల సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మరి బీజేపీ ప్రణాళికలు ఏ మేరకు విజయవంతం అవుతాయో చూడాలి.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...