ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిShabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు

    Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. గురువారం మాచారెడ్డి (macha reddy) మండల కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో షబ్బీర్ అలీతో పాటు ఏఐసీసీ కార్యదర్శి విష్ణు నాథన్ (AICC Secretary Vishnu Nathan), ఎంపీ సురేష్ షెట్కార్ (MP Suresh Shetkar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్నారు. తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతు భరోసా అందించి రికార్డు సాధించామన్నారు. సన్న బియ్యంను పేదలకు అందించి వారి కడుపు నింపుతున్నామన్నారు.

    కేంద్ర ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తుందని బీజేపీ నాయకులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలో జరిగే చిన్నచిన్న గొడవలు పక్కన పెట్టి రాబోయే స్థానిక ఎన్నికల్లో కొత్త,పాత నాయకులు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఏఐసీసీ ఆదేశాలు మేరకు గ్రామ, మండల, బ్లాక్ కమిటీల ఏర్పాటుకు అందరూ సహకరించాలన్నారు. కార్యకర్తలకు బాధ్యతలు, పదవులు ఇవ్వడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

    Shabbir Ali | కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచాం

    తెలంగాణలో ప్రభుత్వం కులగణన నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఏఐసీసీ సెక్రెటరీ విష్ణు నాథన్ అన్నారు. గుజరాత్ (Gujarat) రాష్ట్రాన్ని దేశంలోనే రోల్ మోడల్ చేస్తానన్న మోదీ చేయలేదని, దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్ గా చేసి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) చూపించారన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆహార భద్రత కార్డు(Food safety card) తీసుకువచ్చి పేదలను ఆదుకున్నారని, గిరిజనులకు దళితులకు భూములు అందించారన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ రూ.71 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశారని, చేనేత కార్మికులకు దేశవ్యాప్తంగా 5 వేల కోట్ల రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. బీజేపీ నల్ల చట్టాలను తీసుకొచ్చి 700 రైతులు ప్రాణాలు బలిగొందన్నారు. కాంగ్రెస్​ జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన తీసుకువెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...