ePaper
More
    HomeజాతీయంJagannath Rath Yatra | జగన్నాథుడి సేవలో అదానీ.. 40 లక్షల మందికి ఉచితంగా ఆహారం

    Jagannath Rath Yatra | జగన్నాథుడి సేవలో అదానీ.. 40 లక్షల మందికి ఉచితంగా ఆహారం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagannath Rath Yatra | దేశంలో ఎంతో ఘనంగా జరిగే పూరి జగన్నాథుడి రథయాత్రకు (Puri Jagannath Rath Yatra) సర్వం సిద్ధం అయింది.

    ఒడిశాలోని పూరిలో గల జగన్నాథుడి రథయాత్రకు ఏటా లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. జూన్​ 27న (శుక్రవారం) రథయాత్ర ప్రారంభం కానుంది. 12 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. జగన్నాథుడు భక్తుల (Lord Jagannath devotees| దగ్గరకు వచ్చి దర్శనం ఇస్తాడు. పూరి వీధులు ఈ 12 రోజులు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతాయి. జగన్నాథుడి నామ స్మరణతో మారుమోగుతాయి. జగన్నాథుడి సేవలో ఎందరో తరిస్తుంటారు. అయితే దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త అదానీ (businessman Adani) సైతం తన గ్రూప్​ ఆధ్వర్యంలో జగన్నాథుడి భక్తుల కోసం సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

    లక్షలాది మంది తరలి వచ్చే జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం (Odisha government) ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. అధికారులు సిద్ధంగా ఉన్నారు. అధికారులకు మద్దతు ఇవ్వడంతో పాటు భక్తులకు చేయూతగా ఉండటానికి అదానీ గ్రూప్​ (Adani Group) సమగ్ర సేవా ప్రయత్నాన్ని చేపడుతోంది. ఈ ఏడాది నాలుగు మిలియన్ల మందికి భోజనం, పానీయాలు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. యాత్రికులకు, అధికారులకు ఉచిత, పోషకమైన భోజనాన్ని అందించేందుకు ఆహార కౌంటర్లు ఏర్పాటు చేసింది. నగరం అంతటా కూల్ డ్రింక్స్ అందించే పానీయాల కౌంటర్లు కూడా ఏర్పాటు చేయనుంది.

    Jagannath Rath Yatra | కార్మికులకు అండగా..

    అదానీ గ్రూప్​ (Adani Group) ఇటీవల జరిగిన మహాకుంభమేళాలో కూడా సేవా కార్యక్రమాలు చేపట్టింది. తాజాగా రథయాత్రలో కూడా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. పూరి బీచ్ (Puri beach) శుభ్రపరచడానికి వలంటీర్లను నియమించనుంది. అధికారిక వలంటీర్లకు ఉచిత టీ-షర్టులు, మున్సిపల్ కార్మికులకు ఫ్లోరోసెంట్ సేఫ్టీ వెస్ట్‌లు, అధికారులు, సేవలో ఉండే భక్తులకు వివిధ రకాల జాకెట్లు, రెయిన్‌కోట్లు, క్యాప్‌లు గొడుగులు అందించాలని నిర్ణయించింది. పూరి జిల్లా అధికారులు, ఇస్కాన్, స్థానిక స్వచ్ఛంద సంస్థల సహకారంతో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అదానీ గ్రూప్​ ప్రకటించింది.

    More like this

    YS Jagan | చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డ జగన్​.. ప్రభుత్వం ఉందా అని ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandra Babu)...

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...