ePaper
More
    Homeటెక్నాలజీHonor X9c 5G | 108MP కెమెరా, 6,600mAh బ్యాటరీతో మిడ్-రేంజ్‌లో సెన్సేషన్.. ధర, ఫీచర్లు...

    Honor X9c 5G | 108MP కెమెరా, 6,600mAh బ్యాటరీతో మిడ్-రేంజ్‌లో సెన్సేషన్.. ధర, ఫీచర్లు ఇవే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Honor X9c 5G | భారత మార్కెట్‌లో హానర్ స్మార్ట్ ఫోన్ మరోసారి తన దూకుడు చూపించేందుకు రెడీ అయ్యింది. అధికారికంగా ప్రకటించిన ఈ కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ (Honor X9c 5G) అనేది భారతీయ వినియోగదారులను ఆకట్టుకోనుంది. అమెజాన్‌లో అందుబాటులోకి రానున్న‌ ఈ ఫోన్ సూపర్ ఫీచర్స్ క‌లిగి ఉంది. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే విషయంలో స్పెషలిటీస్ ఏంటి? ధర ఎంత ఉంటుందనే చ‌ర్చ జోరుగా న‌డుస్తుంది.

    Honor X9c 5G | ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు (Key Specs):

    కెమెరా : 108MP మెయిన్ కెమెరా (OIS సపోర్ట్‌తో), 5MP అల్ట్రా వైడ్, 16MP ఫ్రంట్ కెమెరా, 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్

    బ్యాటరీ : 6,600mAh భారీ బ్యాటరీ, 66W ఫాస్ట్ ఛార్జింగ్

    డిస్‌ప్లే : 6.78 అంగుళాల FHD+ AMOLED డిస్​ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్

    ప్రాసెసర్ : Snapdragon 6 Gen 1

    సాఫ్ట్‌వేర్ : Android 15 (మ్యాజిక్ OS 9.0)

    వేరియంట్లు : 8GB RAM + 256GB, 12GB RAM + 256GB, 12GB RAM + 512GB

    అంచనాల ప్రకారం ధర రూ. 25,999 (ప్రారంభ ధర) ఉంటుంద‌ని తెలుస్తోంది. ప్రత్యేకంగా అమెజాన్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. అధికారిక లాంచ్ తేదీ ఇంకా వెల్లడించలేదు, కానీ త్వరలోనే ఏదో ఒక అప్‌డేట్ రానుంది. Snapdragon 6 Gen 1 ప్రాసెసర్ సాధారణ యూజర్లకు బాగా సరిపోతుంది. రోజూ యాప్స్, సోషల్ మీడియా, వీడియోలు వంటి పనులకు ఇది పర్ఫెక్ట్. కానీ, హై-ఎండ్ గేమింగ్ కోసం చూస్తున్నవారు ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ ఉన్న ఫోన్లను పరిగణనలోకి తీసుకోవాలి.

    కెమెరా లవర్స్‌కు, రోజంతా బ్యాటరీ అవసరమయ్యే యూజర్లకు, పెద్ద స్క్రీన్‌లో వీడియో అనుభవం కోరేవారికి, మంచి డిజైన్, ప్రీమియం లుక్‌ను కోరుకునే వారికి ఇది బాగుంటుంది. Honor X9c 5G స్మార్ట్‌ఫోన్ మిడ్-రేంజ్ విభాగంలో బాగా పాపుల‌ర్ అయ్యే అవకాశముంది. పెద్ద బ్యాటరీ, ప్రీమియం డిస్‌ప్లే, కెమెరా ఫీచర్లతో ఇది ఒక బెస్ట్ సెల్లర్‌గా మారే ఛాన్స్ ఉంది. అయితే మార్కెట్‌లో Vivo, iQOO, Motorola వంటి బ్రాండ్ల నుంచి ఉండే పోటీని తట్టుకోగలదా అనే ప్రశ్న మాత్రం ఇప్పుడు వినిపిస్తోంది. మీరు ఫోటోగ్రఫీ లవర్ అయి.. డేలీ యూజ్‌ కోసం మంచి ఫోన్ చూస్తుంటే.. Honor X9c 5G పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

    More like this

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...