ePaper
More
    HomeజాతీయంBangalore House Rents | బెంగ‌ళూరులో ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకుంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి..!

    Bangalore House Rents | బెంగ‌ళూరులో ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకుంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Bangalore House Rents | మ‌న తెలుగు వారు సిలికాన్ సిటీ బెంగ‌ళూరుకి (Bangalore) ఉద్యోగాల కోసం వెళుతుంటారు. అక్కడ ఇల్లు అద్దె(House Rent)కు తీసుకొని ఉద్యోగం చేస్తుంటారు. అయితే అక్క‌డ అద్దె ఇల్లు వెతకడం అంత ఈజీ కాదు. సిలికాన్ సిటీ(Silicon City)గా పేరు తెచ్చుకున్న బెంగళూరులో నివాసం ఏర్పరుచుకోవాలంటే ముందుగానే కొన్ని కీలక విషయాలపై స్పష్టత అవసరం.

    Bangalore House Rents | నీటి సమస్య

    చాలా ప్రాంతాల్లో BWSSB (Municipal water) సరఫరా లేదు. ఎండాకాలంలో ట్యాంకర్ల పైనే ఆధారపడాల్సి వస్తుంది. కొన్నికొన్ని అపార్ట్‌మెంట్లలో నీటి మెయింటెనెన్స్ ఛార్జీలు రూ.4,000 – 5,000 వరకూ అదనంగా వసూలు చేస్తారు. ఫ్లాట్ తీసుకునే ముందు అక్కడ నివసిస్తున్న వారిని లేదా సెక్యూరిటీ గార్డులను అడిగి నీటి పరిస్థితిని తెలుసుకోవడం తప్పనిసరి.

    Bangalore House Rents | అద్దె ఒప్పందంలోని కీలక నిబంధనలు

    నోటీస్ పీరియడ్ ఎంత అనేది ముందుగా తెలుసుకోండి. కొన్ని చోట్ల మూడు నెలల ముందుగానే చెప్పాలని ఒత్తిడి చేస్తారు. పెయింటింగ్ ఛార్జీలు లేదా ఇతర మెయింటైనెన్స్ ఖర్చులు(Maintenance costs) చివరలో మీ మీదే వేసే అవకాశం ఉంటుంది. అవి ఒప్పందంలో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి.

    Bangalore House Rents | సెక్యూరిటీ డిపాజిట్

    చాలా మంది యజమానులు కనీపం 5 నుండి 10 నెలల అద్దె మొత్తాన్ని డిపాజిట్‌(Seurity Deposit)గా అడుగుతుంటారు. దాదాపు 30-40% తగ్గించి ఆఫర్ చేస్తే చాలామంది ఒప్పుకుంటారు. 1BHK లేదా వ్యక్తిగతంగా ఉండే వారికి రూ.20,000 – 30,000 డిపాజిట్ సరిపోతుందని సూచిస్తున్నారు.

    Bangalore House Rents | ఫ్లాట్ ఎంపిక

    ఆన్‌లైన్‌లో మాత్రం వెతకకండి. మీరు ఉండాలనుకునే ప్రాంతంలో డైరెక్ట్‌గా నడుచుకుంటూ వెళ్లి చూడండి. చాలా మంది ఇళ్లు “To-Let” బోర్డులతో ఉంటాయి, అవి ఏజెంట్లు చూపించారు.

    Bangalore House Rents | డాక్యుమెంటేషన్

    ఇంట్లోకి ప్రవేశించే ముందు అన్ని గదుల ఫొటోలు, వీడియోలు తీసి డాక్యుమెంట్ చేయడం మంచి అలవాటు. రిపేర్లు, డామేజెస్ విషయంలో మీపై తప్పులు వేసే అవకాశాన్ని తగ్గిస్తుంది.

    Bangalore House Rents | లీగల్ క్లారిటీ

    మీరు తీసుకునే ఇంటిపై ఎటువంటి చట్టపరమైన వివాదాలు లేవని నిర్ధారించుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. అందుకోసం మీరు చేయవలసింది (Resident Welfare Association) (RWA) నుండి NOC (No Objection Certificate) తీసుకోవాలి. దాని వలన సమస్యల నుండి గట్టెక్కవచ్చు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...