- Advertisement -
HomeUncategorizedPostal Seving Scheme | రోజుకు రూ.50 పొదుపు.. చేతికి రూ.30 లక్షల పైనే.. తపాలాశాఖ...

Postal Seving Scheme | రోజుకు రూ.50 పొదుపు.. చేతికి రూ.30 లక్షల పైనే.. తపాలాశాఖ సూపర్​ పథకం ఇదిగో..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Postal Seving Scheme : పొదుపు మంత్రం ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల ప్రజల్లో ఇది మరింత పెరిగింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియనందున, కుటుంబ సభ్యుల కోసం తమకు తోచినంత మనీని దాచుకుంటున్నారు.

చాలా మంది మనీని సేవ్ చేయడానికి పోస్టు ఆఫీసులను ఆశ్రయిస్తున్నారు. కేవలం సేవింగ్స్ కాకుండా లాభాలు వచ్చే పథకాలపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. గోల్డ్‌, మ్యూచువల్ ఫండ్స్‌ కంటే తపాలా శాఖ పథకాలు బెటర్​గా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో “గ్రామ సురక్ష యోజన” స్కీమ్​ గురించి తెలుసుకోవాల్సిందే.

- Advertisement -

Postal Seving Scheme : గ్రామ సురక్ష యోజన

రూరల్​ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్​ ప్రోగ్రామ్‌ Rural Postal Life Insurance Scheme program లో భాగంగా గ్రామ సురక్ష యోజన తీసుకొచ్చారు. దేశంలోని గ్రామీణ ప్రజల అభ్యున్నతి కోసం తపాలా శాఖ 1995లోనే ఈ స్కీమ్​ను తీసుకొచ్చింది.

19 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న భారతీయులకు ఇందులో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. గరిష్టంగా 60 ఏళ్ల టెన్యూర్ వరకు పెట్టుకునే వెసులుబాటు ఉంది. అంటే మెచ్యూరిటీ పీరియడ్ ను 55 , 58 , 60 ఏళ్లు.. ఏదైనా కన్వినెంట్​గా ఉన్నది ఎంచుకోవచ్చు.

ఈ పథకంలో రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. స్కీమ్‌కు సంబంధించి ప్రీమియం చెల్లించడానికి నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం.. ఆప్షన్లు ఉన్నాయి.

Postal Seving Scheme : నెలవారీ పొదుపు…

గ్రామ సురక్ష యోజన పథకంలో చేరినవారు నెలకు రూ.1,515 పొదుపు చేయాల్సి ఉంటుంది. అంటే రోజుకు రూ.50 అన్నమాట. ఇందులో పెట్టుబడి పెడితే తిరిగి రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు రాబడిని పొందొచ్చు. ఉదా.. ఒక వ్యక్తి 19 ఏళ్ల వయసులో రూ.10 లక్షల ప్రీమియం ఎంపిక చేసుకుంటే, అతను 55 ఏళ్ల వయసు వచ్చే వరకు నెలకు రూ.1,515 లను ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 58 సంవత్సరాలు ఎంచుకంటే నెలకు రూ.1,463, 60 ఏళ్ల వరకైతే రూ.1,411 ప్రీమియం కట్టాల్సి ఉంటుంది.

Postal Seving Scheme : రాబడి ఇలా…

55 ఏళ్ల వరకు పథకంలో పెట్టుబడి పెడితే రూ.31.60 లక్షలు తిరిగి వస్తాయి. 58 ఏళ్లకు 33.40 లక్షలు, 60 ఏళ్ల వరకైతే రూ.34.60 లక్షలు మెచ్యూరిటీ సమయంలో చేతికి అందుతాయి. గ్రామ సురక్ష యోజన కింద 80 ఏళ్లు నిండిన వ్యక్తికి సదరు మొత్తాన్ని ఇస్తారు. ఒకవేళ పాలసీదారు మరణిస్తే ఈ మొత్తాన్ని వారి చట్టపరమైన వారసులకు / నామినీకి అందిస్తారు.

పాలసీ తీసుకున్న 3 ఏళ్ల తర్వాత పాలసీదారు స్వచ్ఛందంగా పథకాన్ని నిలిపివేసుకోవచ్చు. అయితే, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. 5 ఏళ్ల తర్వాత సరెండర్ చేస్తే బోనస్ వర్తిస్తుంది. పాలసీ తీసుకున్న 4 ఏళ్ల తర్వాత లోన్​ సౌకర్యం ఉంటుంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News