ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Home Minister Amit Shah | కేంద్ర హోంమంత్రి పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు

    Home Minister Amit Shah | కేంద్ర హోంమంత్రి పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Home Minister Amit Shah | కేంద్ర హోంమంత్రి అమిత్​ షా జిల్లా పర్యటనకు వస్తున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో సీపీ సాయి చైతన్యతో (CP Sai Chaitanya) కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 29న కేంద్ర హోంమంత్రి అమిత్​షా నగరంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయం (National Turmeric Board Office) ప్రారంభోత్సవం చేస్తారన్నారు. అనంతరం బైపాస్​ చౌరస్తాలో డీఎస్​ విగ్రహాన్ని (DS statue) ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత పాలిటెక్నిక్​ గ్రౌండ్​లో (Polytechnic Ground) రైతుసభలో పాల్గొంటారని వివరించారు.

    Home Minister Amit Shah | ట్రాఫిక్​ సమస్య తలెత్తవద్దు..

    పాలిటెక్నిక్​ గ్రౌండ్​లో జరిగే సభకు ట్రాఫిక్​ ఇబ్బందుల రాకుండా చూడాలని కలెక్టర్​ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక హెలీకాప్టర్​లో ఆయన జిల్లాకు వస్తున్నందున కలెక్టరేట్​లో హెలీప్యాడ్​ సిద్ధం చేయాలని ఆర్​అండ్​బీ అధికారులకు సూచించారు. ఎక్కడా కూడా లోటుపాట్లకు తావులేకుండా పర్యటకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రతాపరంగా సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...