ePaper
More
    HomeసినిమాKannappa Review | క‌న్న‌ప్ప సినిమా ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. చివరి 15 నిమిషాలు అద్భుతమట..!

    Kannappa Review | క‌న్న‌ప్ప సినిమా ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. చివరి 15 నిమిషాలు అద్భుతమట..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Kannappa | టాలీవుడ్ న‌టుడు మంచు విష్ణు (Manchu Vishnu) ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన చిత్రం క‌న్నప్ప‌. ఈ చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ న‌టించ‌డంతో మూవీపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. చిత్ర కథ చారిత్రకాంశాలతో ముడిపడి ఉండడంతో చిత్ర నిర్మాత మోహన్ బాబు(Mohan Babu) స్థలపురాణం తెలిసి వారి నుండి, అలానే శ్రీకాళహస్తి క్షేత్ర పూజారులను నుండి కూడా ప్ర‌త్యేకమైన అనుమతి తీసుకున్నారు. సెన్సార్ స‌భ్యులు మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. రేపు ఈ చిత్రం భారీ ఎత్తున విడుద‌ల కాబోతుంది. అయితే బుధ‌వారం రాత్రి ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖుల కోసం స్పెషల్ ప్రీమియర్ షోలు వేశారు.

    Kannappa | ఫ‌స్ట్ రివ్యూ..

    బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు, రివ్యూయర్లకు సినిమా చూపించగా, అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం ఏంటంటే చిత్ర‌ క్లైమాక్స్. సినిమా చూసిన వారు బయటకు వచ్చేటప్పటికి “కన్నప్ప” క్లైమాక్స్ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. రిషబ్ శెట్టి ‘కాంతార’ చివరి సన్నివేశాల్లానే, ఈ చిత్రంలో కూడా చివరి 15 నిమిషాలు అత్యద్భుతంగా తెరకెక్కించారని మొదటి ఫీడ్‌బ్యాక్. శివ భక్తులైతే ఎమోషన్‌తో కన్నీళ్లు పెట్టేలా ఉందని చెబుతున్నారు. తిన్నడు.. ఎలా నాస్తికుడి నుంచి శివ భక్తుడిగా మారాడు? అన్న ట్రాన్స్​ఫర్మేషన్​ (Transformation) చిత్రంలో చాలా బాగా చూపించారట. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగిందని, ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని చెబుతున్నారు.

    మోహన్ లాల్(Mohan Lal) ఎపిసోడ్‌కు భారీ ప్రశంసలు ల‌భిస్తున్నాయి. ఇక ప్రభాస్ (Prabhas) ‘రుద్ర’ పాత్రలో 40 నిమిషాల అతిథి పాత్రలో ఆకట్టుకున్నాడట. అక్షయ్ కుమార్ పరమేశ్వరుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీగా మెరిశారని విశ్లేషకులు చెబుతున్నారు. ‘కన్నప్ప’ పాత్రలో విష్ణు మంచుకు కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. యాక్షన్, ఎమోషన్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ చివరి 15 నిమిషాల్లో ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫస్ట్ హాఫ్ వేగం తగ్గిందని, కొన్ని చోట్ల నిర్మాణ విలువలు తక్కువగా కనిపించాయని అయినా చివరి భాగం ఈ లోపాల్ని కవర్ చేసిందని సమీక్షకుల అభిప్రాయం. ‘కన్నప్పస‌ టికెట్ ధరకు తగినంత వినోదం అందించ‌డం ఖాయం అంటున్నారు. విష్ణు మంచుకు ఇది గేమ్‌చేంజర్ కావొచ్చన్న టాక్స్ కూడా వినిపిస్తున్నాయి.

    More like this

    Pochampad Village | ‘సెంట్రల్‌’ వెలుగులెప్పుడో..!.. అంధకారంలో పోచంపాడ్‌ మార్గం

    అక్షరటుడే, మెండోరా : Pochampad Village | ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను చూసేందుకు జిల్లాతోపాటు ఇతర...

    Chakali Ailamma | చాకలి ఐలమ్మ స్పూర్తి అందరికీ ఆదర్శం

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాటస్ఫూర్తి అందరికీ...

    TTD EO | టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్​కుమార్​ సింఘాల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TTD EO | టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌ (Anil Kumar Singhal) బుధవారం...