ePaper
More
    Homeలైఫ్​స్టైల్​Online Matches | వ‌రుడు లేదా వ‌ధువు కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారా.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్పనిస‌రి..!

    Online Matches | వ‌రుడు లేదా వ‌ధువు కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారా.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్పనిస‌రి..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Online Matches | ఈ రోజుల్లో పెళ్లి అంటే అబ్బాయి లేదా అమ్మాయిలు భ‌య‌ప‌డాల్సి వ‌స్తుంది. అందుకు కార‌ణం ఇటీవ‌ల మ‌నం వార్త‌ల‌లో చూస్తున్న సంఘ‌ట‌న‌లే. పెళ్లయిన మ‌హిళ వివాహేత‌ర సంబంధం(Extramarital affair) వ‌ల‌న క‌ట్టుకున్న మొగుడిని చంప‌డం, అలానే భ‌ర్త వివిధ కార‌ణ‌ల‌తో భార్య‌ని అంత‌మొందించ‌డం వివాహ బంధంపై న‌మ్మ‌కం లేకుండా చేస్తున్నాయి. ఈ కార‌ణాల వ‌లన సంబంధాలు కూడా కుద‌ర‌డం లేదు. ఈ క్ర‌మంలో ఇప్పటి తరం యువత జీవిత భాగస్వామి ఎంపికలో సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. డేటింగ్ యాప్‌లు, మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల(Matrimonial websites) ద్వారా సంబంధాలు వెతుక్కుంటున్నారు. కొంద‌రికి వీటి వ‌ల‌న మంచే జ‌రుగుతున్నా మ‌రి కొంద‌రు మాత్రం మోస‌పోతున్నారు.

    Online Matches | ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి

    నకిలీ ప్రొఫైళ్లు, బ్లాక్‌మెయిల్(Blackmail) ఘటనలు కూడా మ‌నం చూస్తున్నాం. అందుకే సైబర్ క్రైమ్(Cybercrime) విభాగం పలు జాగ్రత్తలు సూచిస్తోంది. వాటిని పాటించటం వల్ల మోసాల నుండి తప్పించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో భాగస్వామిని వెతుక్కునే వారు ముందు ఆ వెబ్ సైట్ న‌మ్మ‌దగిన‌దేనా లేదా అని చెక్ చేసుకోవాలి. యూజర్ రివ్యూలు చదవండి. స్నేహితులు, బంధువుల సలహా తీసుకోండి. మ్యాట్రిమోనియల్ కోసం ప్రత్యేకంగా కొత్త ఈ మెయిల్ (E Mail) ఓపెన్ చేసుకోవడం మంచిది. మ‌న ప‌ర్స‌న‌ల్ ఈ మెయిల్ ఏ మాత్రం ఉప‌యోగించ‌వ‌ద్దు.

    ఇక ఫోన్ నంబర్, అడ్రస్, ఫొటోలు, పర్సనల్ డీటెయిల్స్ వంటి వెంటనే షేర్ చేయకండి. నమ్మకమొచ్చిన తర్వాత మాత్రమే వివరాలు తెలియజేయండి. మీరు కలవబోయే వ్యక్తి గురించి కుటుంబానికి తెలియ‌జేయ‌డం త‌ప్ప‌నిసరి. పబ్లిక్ ప్లేస్‌లో మాత్రమే కలవండి. మీతో పాటు ఎవరైనా నమ్మదగిన వ్యక్తిని తీసుకెళ్లండి. అవతలి వ్యక్తి నిజాయితీగా ఉన్నారా లేదా అని తెలుసుకునేందుకు వారితో కాస్త స‌మ‌యం కేటాయించి వ్యక్తిత్వం, కుటుంబం, ఉద్యోగం గురించి అడగండి. మీ ప‌ర్స‌న‌ల్‌ ఫొటోలు పంపడం వల్ల బ్లాక్‌మేయిల్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబ‌ట్టి వెంట‌నే అస్స‌లు పంప‌కండి. డబ్బులు అడిగితే అనుమానించాల్సి ఉంటుంది. విదేశీ చిరునామా ఉన్న వారితో కాస్త జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. వారి వివరాలు నిజమేనా అని ధృవీకరించుకోండి. వ్యక్తిగతంగా కలవకముందే పెళ్లికి సంబంధించి హామీలు ఇవ్వవద్దు, తీసుకోవద్దు.సైబర్ నేరగాళ్లు(Cyber ​​criminals) వివిధ ర‌కాలుగా ప్రొఫైల్స్ సృష్టిస్తూ నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు. అందుకే చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. అనుమానాస్పద ప్రొఫైల్ అనిపించిన‌ప్పుడు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...