అక్షరటుడే, బాన్సువాడ : Nasrullabad | అదనపు కట్నం తీసుకు రావాలని వేధిస్తున్న భర్త, ఆయన మొదటి భార్యపై రెండో భార్య ఫిర్యాదు చేసినట్లు ఎస్సై లావణ్య SI lavanya తెలిపారు. నస్రుల్లాబాద్ nasrullabad మండలం అంకోల్ తండాకు చెందిన సంగీతను లింగంపేట్ lingampet మండలం నల్లమడుగు తండాకు చెందిన బన్సీ రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతకుముందు జెమ్నిబాయిని మొదటి విహహం చేసుకొని విడాకులు తీసుకున్నాడు. సంగీతకు పిల్లలు పుట్టకపోవడంతో మొదటి భార్యను మళ్లీ ఇంటికి తీసుకొచ్చాడు. వారు ఇద్దరు కలిసి 8 నెలలుగా తనను వేధిస్తున్నారని సంగీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
