ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | ఎమ్మెల్సీ క‌విత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. ఆంధ్ర బిర్యానీ మ‌నం తింటామా..? అని...

    MLC Kavitha | ఎమ్మెల్సీ క‌విత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. ఆంధ్ర బిర్యానీ మ‌నం తింటామా..? అని ప్ర‌శ్న‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: MLC Kavitha | తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత(MLC Kavitha) వివాదంలో చిక్కుకున్నారు. ఆంధ్ర బిర్యానీ మ‌నం తింటామా అని ఆమె వ్యాఖ్యానించ‌డం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడిన క‌విత బ‌న‌క‌చ‌ర్ల అంశంపై మాట్లాడారు. ఈ క్ర‌మంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ గురించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం చేశారు. ఆంధ్ర బిర్యానీ (Andhra Biryani) ఎట్లుంట‌దో గ‌తంలోనే కేసీఆర్ సార్ చెప్పిండు. గా ఆంధ్ర బిర్యానీ మ‌నం తింటామా..? అని క‌విత అన్నారు. ఆమె వ్యాఖ్య‌ల‌పై వివాదం చెల‌రేగింది.

    MLC Kavitha | రేవంత్‌పై ఫైర్‌

    బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు(Banakacharla Project)తో తెలంగాణ‌కు అన్యాయం జ‌రుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అచేత‌నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని క‌విత ఫైర్ అయ్యారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఎదురు చెప్ప‌లేక పోతున్నార‌న్నారు. గ‌తేడాది జూలై 6న చంద్ర‌బాబు, రేవంత్ క‌లిసిన త‌ర్వాతే బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు పురుడు పోసుకుంద‌న్నారు. ప్ర‌జాభ‌వ‌న్‌లో చంద్ర‌బాబుకు బిర్యానీ తినిపించి బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు క‌ట్టుకోండ‌ని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలిపారు. గోదావ‌రి, కావేరీ నదుల అనుసంధానం పేరిట చంద్ర‌బాబు(AP Chief Minister Chandrababu) కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని పోల‌వ‌రం-బ‌న‌క‌చ‌ర్ల లింకేజ్ ప్రాజెక్టు చేప‌డుతున్నార‌న్నారు.

    MLC Kavitha | రూ.2 ల‌క్ష‌ల కోట్ల అప్పు ఏమైంది?

    20 నెలల్లో రూ.2 లక్షల కోట్ల అప్పు తెచ్చిన సీఎం రేవంత్ ఆ నిధుల‌ను ఏం చేశారో చెప్పార‌ని ప్ర‌శ్నించారు. 18 నెల‌ల కాలంలో రూ.2 ల‌క్ష‌ల కోట్లు అప్పు చేసిన‌ప్ప‌టికీ, మ‌హిళ‌ల పింఛ‌న్లు కూడా పెంచ‌లేద‌న్నారు. అప్పు కావాల‌ని రేవంత్‌రెడ్డి.. ఆర్‌ఈసీ సంస్థకు లేఖ రాశార‌ని, ఈ క్ర‌మంలో కేసీఆర్(KCR) హయాంలో నిర్మించి కాళేశ్వరం ప్రాజెక్టును గొప్ప‌గా చెప్పార‌న్నారు. కాళేశ్వ‌రం నిర్మాణం కోసం కేసీఆర్ గ‌తంలో అదే సంస్థ నుంచి అప్పులు తీసుకొచ్చారని, వాటికి కిస్తీలు చెల్లించ‌డంలో రేవంత్ విఫ‌ల‌మ‌య్యార‌ని విమ‌ర్శించారు. 2024 నుంచి కిస్తీలు కట్టడం లేదని ఆర్‌ఈసీ సంస్థ లేఖ రాసింది. నాన్ పే కస్టమర్‌గా ప్రకటిస్తామని ఆర్‌ఈసీ సంస్థ ఆ లేఖలో తెలిపిందని కవిత వెల్ల‌డించారు. రేవంత్ రెడ్డికి జాగృతి తరపున అవినీతి చక్రవరి బిరుదు ఇస్తున్నామ‌న్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభం కాకుండానే కాంట్రాక్టు సంస్థలకు అడ్వాన్సులు చెల్లించార‌ని తెలిపారు. చంద్రబాబు తన అనుభవంతో గోదావరి, కావేరి లింక్ పేరుతో నీళ్లు తరలిస్తున్నారు. సీఎం రేవంత్ సర్కార్ మొద్దు నిద్రతో తెలంగాణ(Telangana)కు అన్యాయం జరుగుతోంది.. అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

    MLC Kavitha | బాబుకు భ‌య‌ప‌డుతున్న సీఎం..

    మ‌న నీళ్లు దోపిడీకి గుర‌వుతున్నా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నీసం స్పందించ‌డం లేద‌ని విమ‌ర్శించారు. కేవ‌లం బాబుకు ఎదురుచెప్ప‌లేని స్థితిలో రేవంత్ ఉండ‌డం మ‌న రాష్ట్ర ప్ర‌భుత్వ దౌర్భాగ్య‌మ‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా మాట్లాడేందుకు రేవంత్ భ‌య‌ప‌డుతున్నార‌న్నారు. ప్రాజెక్టును ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవ‌డంలో, అపెక్స్ కౌన్సిల్(Apex Council) నిర్వ‌హించాల‌ని ప‌ట్టుబ‌ట్డడంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్నారు. ఒక్క చుక్క నీళ్లు కూడా పోనీయ‌మ‌ని మంత్రులు గ‌ప్పాలు కొడుతున్నార‌నే తప్ప కేంద్రంపై ఒత్తిడి తేవ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం తొంద‌రగా మేల్కొని అపెక్స్ కౌన్సిల్ స‌మావేశానికి పట్టుబ‌ట్టాల‌న్నారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...