ePaper
More
    HomeతెలంగాణGovt Employees | ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. బిల్లులు మంజూరు చేసిన ప్రభుత్వం

    Govt Employees | ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. బిల్లులు మంజూరు చేసిన ప్రభుత్వం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Govt Employees | రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు(Employees), పెన్షనర్లకు(Pensioners) గుడ్​ న్యూస్​ చెప్పింది. గత కొంతకాలంగా ఉద్యోగుల వైద్య బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. వీటిని విడుదల చేయాలని ఉద్యోగులు ఎంతోకాలంగా డిమాండ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య బిల్లుల బకాయిలు మంజూరు చేసింది. రూ.180.38 కోట్ల వైద్య బిల్లుల బకాయిలు చెల్లించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) తెలిపారు.

    దీంతో 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం(State Government)పై కొంతకాలంగా ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని వారు ఆగ్రహంతో ఉన్నారు. తమ జీతాలు పెంచాలని, డీఏలు విడుదల చేయాలని కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ సబ్​ కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఉద్యోగుల డిమాండ్లలో ప్రధానంగా డీఏలు, వైద్య బిల్లులు, రిటైర్మెంట్​ బెనిఫిట్​ చెల్లింపులు ఉన్నాయి.

    Govt Employees | ఉద్యోగుల హర్షం

    రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇటీవల డీఏ పెంచింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. 2023 జనవరి 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని పేర్కొంది. మరో నాలుగు డీఏలు పెండింగ్​లో ఉన్నాయి. అయితే మరో డీఏను త్వరలో పెంచనున్నట్లు తెలిపింది. విద్యుత్​ ఉద్యోగులకు కూడా రెండు రోజుల క్రితం ప్రభుత్వం రెండు శాతం డీఏ పెంచింది. తాజాగా వైద్య బిల్లుల బకాయిలు విడుదల చేసింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పెండింగ్​ డీఏలను కూడా విడుదల చేయాలని కోరుతున్నారు.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...