ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిPolice Raids | దాబాల్లో పోలీస్ రైడ్స్.. భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం

    Police Raids | దాబాల్లో పోలీస్ రైడ్స్.. భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : Police Raids | జాతీయ రహదారులపై (national highways) దాబాల్లో యథేచ్ఛగా మద్యం సిట్టింగ్​లు కొనసాగుతున్నాయి. హైవేలపై దాబాల్లో మద్యం విక్రయాలు నేరం అని తెలిసినా ఈ దందా ఆగడం లేదు. పోలీసులు తరచూ తనిఖీలు (Police inspections) చేపడుతున్నా.. పూర్తిస్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారు.

    Police Raids | 161వ జాతీయ రహదారిపై దాబాల్లో తనిఖీలు

    జాతీయ రహదారి 161పై (National Highway 161) ఉన్న దాబాల్లో బుధవారం రాత్రి పోలీసులు స్పెషల్ రైడ్స్ చేపట్టారు. ఏకకాలంలో పలు దాబాల్లో దాడులు చేపట్టారు. ఏకంగా ఆరు దాబాల్లో (dhabas) అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఆరు దాబాల్లో 132 మద్యం బాటిళ్లతో పాటు 71 మంది మందు బాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    Police Raids | దాబాల్లో మద్యం అమ్మకాలు నేరం

    ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల ప్రకారం నేషనల్ హైవేపై ఉన్న దాబాల్లో మద్యం అమ్మకాలు చేయడం నేరమన్నారు. అలా చేస్తే దాబాల యజమానులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు మద్యం మత్తులో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని ఎస్పీ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న ఉద్దేశంతో బుధవారం రాత్రి ఏకకాలంలో అన్ని దాబాలపై రైడ్ చేయడం జరిగిందన్నారు. ఇకపై ఎవరైనా దాబాల్లో మద్యం అమ్మకాలు చేపట్టినా, మద్యం సేవించినా చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    Latest articles

    Raging in Medical College | ర్యాగింగ్​కు పాల్పడిన మెడికోలపై కేసులు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Raging in Medical College | ర్యాగింగ్​కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని...

    Teacher suspension | విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్​

    అక్షరటుడే, ఇందూరు: Teacher suspension | నందిపేట మండలం కుద్వాన్​పూర్ (kundwanpur)​ ప్రభుత్వ పాఠశాలలో శనివారం జరిగిన ఘటనపై...

    Drone Attack | రష్యాపై విరుచుకుపడిన ఉక్రెయిన్​.. అణువిద్యుత్​ కేంద్రంపై డ్రోన్​లతో దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Drone Attack | రష్యా–ఉక్రెయిన్​ మధ్య యుద్ధం (Russia–Ukraine War) ఆగడం లేదు. రెండు...

    Vinayaka chavithi | గణపతుల బావి పూడికతీత పనులు ప్రారంభం

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka chavithi | వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా సందడి మొదలైంది. ఇప్పటికే గణనాథులను...

    More like this