ePaper
More
    HomeతెలంగాణCar on Railway Track | రైల్వే ట్రాక్​పై కారుతో యువతి హల్​చల్​.. అడ్డొచ్చిన వారికి...

    Car on Railway Track | రైల్వే ట్రాక్​పై కారుతో యువతి హల్​చల్​.. అడ్డొచ్చిన వారికి కత్తితో బెదిరింపులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Car on Railway Track | సోషల్​ మీడియాలో ఫేమస్​ కావడానికి కొందరు ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తున్నారు. మరికొందరు పిచ్చి పిచ్చి చేష్టలతో రీల్స్​ చేస్తున్నారు. ఇతరులను ఇబ్బందులు పెడుతూ.. తాము ఫేమస్​ కావడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా రీల్స్​ మోజులో ఓ యువతి ఏకంగా రైల్వే ట్రాక్(Railway Track)​పై కారు నడిపింది.

    రోడ్డుపై దూసుకు పోవాల్సిన కారు రైలు పట్టాలపై వెళ్తుండటం చూసి రైల్వే సిబ్బంది(Railway staff)తో పాటు ప్రజలు షాక్​ అయ్యారు. ఓ మహిళా రైలు పట్టాలపై కారు నడుపుతూ హల్​చల్​ చేసింది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిని కత్తి చూపించి బెదిరించడం గమనార్హం. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా(Rangareddy District) శంకర్​పల్లి–నాగులపల్లి మార్గంలో చోటు చేసుకుంది.

    నాగులపల్లి – శంకర్​పల్లి(Shankarpalli–Nagulapalli) మార్గంలో పట్టాలపై యువతి కారు నడుపుతూ వెళ్లింది. కారును గమనించిన సిబ్బంది ఆపడానికి ప్రయత్నించారు. అయితే ఆమె ఆపకుండా వేగంగా దూసుకు పోవడం గమనార్హం. దీంతో నాగులపల్లి గ్రామంలో స్థానికులు ఆమె కారుకు అడ్డు వచ్చారు. దీంతో సదరు యువతి వారికి కత్తి(Knife) చూపించి బెదిరింపులకు పాల్పడటం గమనార్హం. అయితే స్థానికుల ఎలాగో అలాగా ఆమెను కారులో నుంచి బయటకు లాగేశారు.

    Car on Railway Track | రైళ్ల రాకపోకలకు అంతరాయం

    యువతి తీరుతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాక్​పై కారును చూసిన రైలు లోకో పైలట్ ట్రైన్(Train Loco Pilot Train)​ను ఆపారు. బెంగళూరు నుంచి హైదరాబాద్​ వెళ్తున్న రైలును సైతం అధికారులు గంట సేపు ఆపేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు సదరు యువతిని అదుపులోకి తీసుకున్నారు. కాగా రీల్స్(Reels)​ కోసమే ఆమె ట్రాక్​పై కారు నడిపినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. కాగా ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్​ చేస్తున్నారు. కారు నడుపుతున్నప్పుడు సదరు యువతి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...