ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Ap Ration Shops | ఇక ఇంటి వద్దకే రేషన్.. నేటి నుంచే అమలు

    Ap Ration Shops | ఇక ఇంటి వద్దకే రేషన్.. నేటి నుంచే అమలు

    Published on

    అక్షరటుడే, అమరావతి : Ap Ration Shops : రేషన్ పంపిణీ(ration distribution)లో అక్రమాలు నిరోధించడానికి, కార్డుదారులు తమకు అవసరమైన సమయంలో తీసుకునేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం పాత విధానాన్ని మళ్లీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్​ సరకులు ఇచ్చేలా ఏర్పాటు చేసినా.. రేషన్​ డీలర్లు పట్టించుకోవడంలేదు. దీంతో గత నెలలో కొందరు లబ్ధిదారులు సరకులు తీసుకోలేకపోయారు.

    ఈ విషయాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం (AP government).. తాజాగా సదరు లబ్ధిదారుల(beneficiaries) వద్దకు అయిదు రోజుల ముందే సరకులు చేర్చేలా నిర్ణయం తీసుకుంది. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    Ap Ration Shops : జిల్లా స్థాయిలో పర్యవేక్షణ

    రేషన్​ దుకాణాల్లో(ration shops) జులై 1 నుంచి 15వ తేదీ వరకు డీలర్లు(Dealers) సరకులు పంపిణీ చేస్తారు. అంత కంటే ముందే అంటే జూన్ 26 నుంచి అయిదు రోజుల పాటు.. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకు వెళ్లి సరకులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

    Ap Ration Shops : పంపిణీ చేయకుంటే కఠిన చర్యలు..

    ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. వందశాతం ప్రక్రియ పూర్తయ్యే చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. పక్కాగా అమలు ఈ నెల 26 నుంచి డీలర్లే స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ సరకులు ఇవ్వాల్సి ఉంది.

    రేషన్​ దుకాణాలకు ఇన్​ఛార్జులుగా ఉన్న వారికి కూడా ఈ నియమం వర్తిస్తుంది. డీలర్లు ఎక్కడైనా ఇబ్బంది పెడితే వెంటనే తెలియజేయాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు. అర్హులైన లబ్ధిదారులు ఇంటివద్దే ఉండి సరుకులు పొందాలని అధికారులు సూచించారు.

    Latest articles

    Amanta Healthcare IPO | ఈ వారంలో ఒకే ఒక్కటి.. ప్రారంభమైన ‘అమంతా’ సబ్‌స్క్రిప్షన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amanta Healthcare IPO | మార్కెట్‌ ఒడిదుడుకుల నేపథ్యంలో ఐపీవో(IPO) మార్కెట్‌లో సందడి తగ్గింది....

    Bank Holidays | సెప్టెంబ‌ర్‌లో బ్యాంకుల‌కు అన్ని రోజులు సెల‌వులా.. ఒక‌సారి లిస్ట్ చెక్ చేసుకోండి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bank Holidays | ఆగస్టు నెలలో చివ‌రి రోజు సెల‌వుతో ముగిసింది. ఇక కొత్త నెల...

    Weather Updates | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు జిల్లాలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం...

    Bengaluru | చెప్పులో దూరిన పాము.. కాలుకి స్ప‌ర్శ లేక‌పోవ‌డంతో టెక్కీ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bengaluru | బెంగళూరులోని బన్నేరుఘట్టలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(Software...

    More like this