ePaper
More
    HomeతెలంగాణRainy Season | సీజనల్ వ్యాధులు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

    Rainy Season | సీజనల్ వ్యాధులు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Rainy Season : గ్రేటర్​ హైదరాబాద్ నగర జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Chief Minister A. Revanth Reddy) ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌ (Hyderabad Core Urban Region) కు సంబంధించి ప్రత్యేకంగా సమగ్రమైన పాలసీని తయారు చేయాలని సూచించారు.

    మహా నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

    కోర్ అర్బన్​ core urban తో పాటు సెమీ అర్బన్, రూరల్ ఏరియాలపైనా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని, అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.

    Rainy Season : కోర్ అర్బన్ రీజియన్‌లో…

    హైదరాబాద్​ సిటీ అభివృద్ధి పనులకు సంబంధించి వివరాలను అధికారులు తెలియజేయగా.. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. తాగునీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి పూర్తి ప్రణాళికలను తయారు చేయాలన్నారు.

    Rainy Season : పారిశుద్ధ్యం విషయంలో

    ప్రస్తుతం జీహెచ్ఎంసీ (GHMC)పరిధిలో కొనసాగుతున్న తాగునీటి సరఫరా, సీవరేజ్ ట్రీట్​మెంట్​ ప్లాంట్స్ పనుల్లో ప్రస్తుత పరిస్థితిని అధికారులు వివరించారు. అసంపూర్తిగా ఉన్న పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని చెప్పారు. ముఖ్యంగా నగరంలో పారిశుద్ధ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని, వర్షాకాలంలో డెంగ్యూ, చికున్ గున్యా లాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

    More like this

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...

    Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి

    అక్షరటుడే, కోటగిరి: Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి గిరిజనులంతా ఐక్యతతో ముందుకు సాగి, సేవాలాల్‌ బాటలో...