ePaper
More
    Homeఅంతర్జాతీయంDonald Trump | ఇండియా- పాక్ యుద్ధం ఆపింది నేనే.. ట్రంప్ నోట మళ్లీ అదే...

    Donald Trump | ఇండియా- పాక్ యుద్ధం ఆపింది నేనే.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హేగ్‌(Hague)లో జరిగిన నాటో శిఖరాగ్ర (NATO summit) సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) బుధవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్​స్కీ(Ukrainian President Volodymyr Zelensky)ని కలిశారని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. గత ఫిబ్రవరిలో ట్రంప్ వైట్ హౌస్‌లో జెలెన్​స్కీ(Zelensky)ని కలిసిన తర్వాత ఈ ఏడాది ఇది రెండో సమావేశం.

    Donald Trump : ట్రంప్‌తో సమావేశం అనంతరం జెలెన్స్కీ ఏమన్నారంటే..

    “యూఎస్​ US అధ్యక్షుడు ట్రంప్‌తో సుదీర్ఘమైన సమావేశంలో నేను ముఖ్యమైన అంశాలపై చర్చించాను. మేము నిజంగా ముఖ్యమైన అన్ని అంశాలను సమీక్షించాం. అధ్యక్షుడికి, అమెరికాకు ధన్యవాదాలు. కాల్పుల విరమణ, నిజమైన శాంతిని ఎలా సాధించాలో ఇరువురం చర్చించాం. ఉక్రెయిన్​ ప్రజలను ఎలా రక్షించుకోవాలో మాట్లాడాం. వివరాలు తర్వాత వెల్లడిస్తాం..” అని జెలెన్​స్కీ Xలో పోస్ట్ చేశారు.

    Donald Trump : పుతిన్‌తో మాట్లాడతా..

    జెలెన్​స్కీని కలిసిన తర్వాత ట్రంప్ మాట్లాడారు.. “మాకు కొన్ని కష్ట సమయాలు ఉన్నాయి. కానీ, జెలెన్​స్కీ చాలా మంచివాడు. అతన్ని చూసి నేను సంతోషిస్తున్నా. ఇరువురి మధ్య జరిగినది గొప్ప సమావేశం. యుద్ధాన్ని ముగించడానికి కూడా ఇది గొప్ప సమయం అని భావిస్తున్నా.. బహుశా యుద్ధాన్ని ముగించడానికి నేను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Russian President Putin) తో మాట్లాడతా..” అని అన్నారు.

    Donald Trump : భారతదేశం-పాకిస్తాన్ వివాదం గురించి మాట్లాడుతూ..

    భారత్​-పాకిస్తాన్(India-Pakistan) వివాదం గురించి ట్రంప్ మాట్లాడుతూ, “అన్నింటికంటే ముఖ్యమైనది భారత్​, పాకిస్తాన్ వివాదం.. ఇరువురితో వరుస ఫోన్ కాల్స్‌ మాట్లాడి వివాదాన్ని ముగించాను. మీరు ఒకరితో ఒకరు పోరాడితే.. మేము ఎటువంటి వాణిజ్య ఒప్పందం చేసుకోమని చెప్పాను. దీంతో వారు వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అలా ఆణు యుద్ధాన్ని ఆపాను. పాకిస్తాన్ జనరల్ గతవారం నా కార్యాలయంలో ఉన్నారు. ప్రధాన మంత్రి మోడీ నాకు గొప్ప స్నేహితుడు. ఆయన చాలా పెద్దమనిషి,..” అని అన్నారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...