అక్షర టుడే, నిజామాబాద్ అర్బన్: MIM Nizamabad | నగరంలోని 11వ డివిజన్ పరిధిలో గల బాబన్ సాహబ్ పహాడ్‌లో Baban Sahab Pahad రేషన్ షాప్ Ration shop ఏర్పాటు చేయడంపై ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనారిటీ మురికివాడ ప్రాంతాల్లో పేదలు రేషన్ బియ్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఎంపీ అసదుద్దీన్ MP Asaduddin దృష్టికి తీసుకెళ్లామన్నారు.
ఆయన వెంటనే కలెక్టర్‌తో Collector మాట్లాడి అధికారులకు ఆదేశాలిచ్చారని వివరించారు. దీంతో ప్రత్యేకంగా సర్వీస్ పాయింట్ Service point ఏర్పాటు చేశారని తెలిపారు. వెంగల్‌రావు కాలనీ, నుజత్ నగర్, అసద్‌బాబా నగర్, సాగర్ హిల్స్‌లోని పేదలు మే 1వ తేదీ నుంచి బాబన్ సాహబ్ పహాడ్ సర్వీస్ పాయింట్లోనే రేషన్ బియ్యం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు షకీల్ అహ్మద్ ఫాజిల్, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.