ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిCongress Kamareddy | పార్టీ మారడంతోనే ఫోన్ ట్యాప్ చేశారు..: టీపీసీసీ జనరల్​ సెక్రెటరీ

    Congress Kamareddy | పార్టీ మారడంతోనే ఫోన్ ట్యాప్ చేశారు..: టీపీసీసీ జనరల్​ సెక్రెటరీ

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Congress Kamareddy | అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీలోకి మారతానన్న సమాచారం తెలుసుకునేందుకు తనతో పాటు అనుచరుల ఫోన్ ట్యాప్ (Phone tap) చేశారని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ (TPCC General Secretary) గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్​లోని సిట్ కార్యాలయానికి (SIT office) విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు రెండు గంటల పాటు తన వివరణ తీసుకున్నారని తెలిపారు. తనతో పాటు పీఏ కరుణాకర్ రెడ్డి, డ్రైవర్ అశోక్, కాంగ్రెస్ నాయకులు అరవింద్ కుమార్ సిట్ ఎదుట హాజరైనట్లు చెప్పారు.

    2023 అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) సమయంలో కామారెడ్డిలోని తన ఇంట్లో పోలీసులు తరుచూ తనిఖీలు, దాడులు చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్​లో చేరడంతో తన ఫోన్ ట్యాప్​ చేశారని వివరించారు. వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసేలా ఫోన్ ట్యాపింగ్ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

    More like this

    CMC Vellore | వెల్లూరు సీఎంసీని సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    అక్షరటుడే, బాన్సువాడ : CMC Vellore | తమిళనాడులోని ప్రసిద్ధ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (Christian Medical College)...

    Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట

    అక్షరటుడే, బాన్సువాడ: Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట వేశారని బాన్సువాడ ఎస్​ఆర్​ఎన్​కే ప్రభుత్వ డిగ్రీ...

    Manisha Koirala | నేపాల్‌లో హింసాత్మక ఆందోళనలు.. ఇది ఫొటో కాదు.. హింసకు సాక్ష్యం అంటూ మ‌నీషా కోయిరాలా పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Manisha Koirala | పొరుగు దేశం నేపాల్ లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఆందోళనలు తీవ్ర...