ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​CBSE board | సీబీఎస్​ఈ విద్యార్థులకు అలర్ట్​.. ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు పరీక్షలు

    CBSE board | సీబీఎస్​ఈ విద్యార్థులకు అలర్ట్​.. ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు పరీక్షలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: CBSE board | సీబీఎస్​ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విద్యార్థులపై (Students) ఒత్తిడి తగ్గించి, మంచి మార్కులు సాధించేలా అవసరమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) పదో తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ పద్ధతిని 2026 నుంచి అమలు చేయనుంది.

    CBSE board | కొత్త మార్గదర్శకాలు

    పదో తరగతి సీబీఎస్​ఈ సిలబస్​ (CBSE syllabus) చదివే విద్యార్థుల పరీక్షలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను బోర్డు ఆమోదించినట్లు పరీక్షల కంట్రోలర్​ సన్యామ్​ భరద్వాజ్​ PTIకి తెలిపారు. ఇందులో భాగంగా మొదటి దశ పరీక్షలను ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఇక రెండో దశ ఎగ్జామ్స్​ను మేలో నిర్వహించనున్నారు. పదో తరగతి విద్యార్థులు మొదటి దశ పరీక్షల్లో హాజరు కావడం తప్పనిసరి. రెండో దశ ఐచ్ఛికం అని పేర్కొన్నారు. విద్యా సంవత్సరంలో (Academic year) అంతర్గత మూల్యాంకనాలు మాత్రం ఒకసారి జరుగుతాయని CBSE చెప్పింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...