ePaper
More
    HomeతెలంగాణPCC Chief | కేసీఆర్​ పెద్ద తప్పు చేశారు : పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​

    PCC Chief | కేసీఆర్​ పెద్ద తప్పు చేశారు : పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PCC Chief | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​(BRS chief KCR)పై పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​గౌడ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్​ తన హయాంలో ఫోన్​ ట్యాపింగ్(Phone Tapping)​కు పాల్పడి పెద్ద తప్పు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

    ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు కేసీఆర్, కేటీఆర్​(KTR)కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ హేయమైన చర్యగా మహేశ్​గౌడ్​ అభివర్ణించారు. ప్రతిపక్ష నాయకులతో పాటు అధికారులు, జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్​ చేశారన్నారు. కేసీఆర్​, కేటీఆర్​ తమ అవసరాల కోసం సినీ తారలను కూడా వదలలేదన్నారు. దీంతో వారి కుటుంబాల్లో గొడవలు వచ్చి ఎంత దూరం పోయాయో మనం చూశామని ఆయన పేర్కొన్నారు. ఫోన్లు ట్యాప్​ చేసి ఎన్నో సంసారాల్లో చిచ్చు పెట్టారని మండిపడ్డారు. మాట వినని అధికారుల ఫోన్లు కూడా ట్యాప్​ చేశారన్నారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే(BRS MLA)ల ఫోన్లు కూడా ట్యాప్‌ చేశారని పేర్కొన్నారు.

    PCC Chief | ఎంత పెద్దవాళ్లు ఉన్నా శిక్ష పడాల్సిందే..

    ఓ రిటైర్డ్​ అయిన అధికారిని ఎస్​ఐబీ చీఫ్​గా ఎలా పెడతారని మహేశ్​గౌడ్​ ప్రశ్నించారు. కేసీఆర్​, కేటీఆర్​కు సంబంధం లేకుండా ప్రభాకర్​రావు(Prabhakar Rao) ఫోన్​ ట్యాప్ చేశారా అని ప్రశ్నించారు. ఆయనను ఆ పదవిలో కూర్చొపెట్టింది ఎవరని ప్రశ్నించారు. తాము చెప్పినట్లు వినే అధికారులను ఇంటెలిజెన్స్​లో కూర్చొబెట్టి కేసీఆర్​, కేటీఆర్​ ఫోన్లను ట్యాప్​ చేయించారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో ఎంత పెద్ద వారు ఉన్నా శిక్ష పడుతుందని స్పష్టం చేశారు.

    PCC Chief Mahesh Goud | హామీలు అమలు చేశాం

    తెలంగాణలో 18 నెలల కాంగ్రెస్​ పాలన స్వర్ణయుగం అని పీసీసీ అధ్యక్షుడు(PCC Chief Mahesh Goud) అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు చెప్పారు. రైతు భరోసా(Rythu Bharosa) నుంచి ఉద్యోగాల దాకా.. అన్ని హామీలు నెరవేర్చామన్నారు. తొమ్మిది రోజుల్లోనే వానాకాలం సాగు సీజన్​కు సంబంధించి రూ.9 వేల కోట్ల రైతు భరోసా అన్నదాతల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.

    PCC Chief | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో గెలుస్తాం

    జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తామని మహేశ్​ గౌడ్​ ధీమా వ్యక్తం చేశారు. జుబ్లీహిల్స్​ ఎమ్మెల్యేగా బీఆర్​ఎస్​ నుంచి గెలుపొందిన మాగంటి గోపినాథ్(Jubilee Hills MLA Maganti Gopinath)​ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబానికి సీటు వదిలేసే ఆనవాయితీ ఉండేదని మహేశ్​ గౌడ్​ అన్నారు. కానీ కేసీఆర్‌ దాన్ని బ్రేక్‌ చేశారని చెప్పారు. దీంతో తాము సైతం పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కాగా.. జూబ్లీహిల్స్​ టికెట్​ కాంగ్రెస్​లో ఇప్పటి నుంచే ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు. తానే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇటీవల మాజీ ఎంపీ అజారుద్దీన్(Former MP Azharuddin)​ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టికెట్​ ఖరారు అయ్యే వరకు ఎవరు పోటీ చేసేది తెలియదని మహేశ్​ గౌడ్​ స్పష్టం చేశారు. ఎవరైనా తామే పోటీ చేస్తామని చెప్పుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...