ePaper
More
    HomeతెలంగాణLocal Body Elections | స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు.. అప్పటిలోగా ఎలక్షన్లు నిర్వహించాలని...

    Local Body Elections | స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు.. అప్పటిలోగా ఎలక్షన్లు నిర్వహించాలని ఆదేశాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో గతేడాది ఫిబ్రవరితో గ్రామ పంచాయతీల(Gram Panchayats) పాలక వర్గం గడువు ముగిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. దీంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవికాలం జులైలో ముగిసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ (Telangana) హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో గతంలోనే విచారణ ముగియగా.. బుధవారం ఉదయం తీర్పు వెలువరించింది.

    Local Body Elections | సెప్టెంబర్​ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలి

    రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్​ 30 లోపు నిర్వహించాలని ప్రభుత్వంతో పాటు, ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బుధవారం తీర్పు చెప్పింది. దీంతో సర్పంచ్​, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సెప్టెంబర్​ 30 లోపు జరగనున్నాయి. కాగా పిటిషన్లపై వాదనల సమయంలో ఎన్నికల నిర్వాహణకు 30 రోజుల గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం(state government) కోరింది. ఈ విషయంలో హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission), ప్రభుత్వం, పిటిషనర్లు వాదనలు వినిపించారు. అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి మాధవి దేవి సెప్టెంబర్​ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

    Local Body Elections | హైకోర్టు తీర్పుపై హర్షం

    రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) షెడ్యూల్​ త్వరలో వెలువడుతుందని ఇటీవల పలువురు మంత్రులు ప్రకటన చేశారు. నెలాఖరులో షెడ్యూల్​ విడుదల చేసి వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. దీంతో నాయకులు, కార్యకర్తలు ఎన్నికల కోసం ప్రణాళికలు కూడా వేసుకున్నారు. అయితే మళ్లీ ఎన్నికల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. లోకల్​ బాడీ ఎలక్షన్స్​పై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో పోటీ చేయాలనుకునే వారితో పాటు నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు ఆదేశాలతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...