ePaper
More
    HomeతెలంగాణTelangana Thalli Statue | ప్రభుత్వం కీలక నిర్ణయం.. కలెక్టరేట్​లలో తెలంగాణ తల్లి విగ్రహం

    Telangana Thalli Statue | ప్రభుత్వం కీలక నిర్ణయం.. కలెక్టరేట్​లలో తెలంగాణ తల్లి విగ్రహం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Telangana Thalli Statue | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గల కలెక్టరేట్​లలో(Collectorates) తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 12 అడుగుల ఎత్తుతో ఈ ప్రతిమలను ఏర్పాటు చేయాలని, ఒక్కో విగ్రహానికి రూ.17.5 లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే విగ్రహం ఎత్తు, ఖర్చు విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

    Telangana Thalli Statue | విగ్రహాన్ని మార్చిన కాంగ్రెస్

    తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్​ఎస్​, ప్రజాసంఘాల నాయకులు కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్నిTelangana Thalli Statue) రూపొందించారు. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు ఆ విగ్రహాలను ఊరూరా ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో ఒక చేతిలో బతుకమ్మ, గద్వాల, పోచంపల్లి నేతన్నలకు ప్రతీకగా పట్టు చీర, కరీంనగర్ వెండి మట్టెలు, ఒక చేతిలో మక్కకంకులు ఉండేవి. కిరీటంతో పాటు ఆ కిరీటంలో ప్రసిద్ద కోహినూర్ వజ్రం, వడ్డాణం, జరీ అంచుచీరతో తెలంగాణ తల్లి విగ్రహం ఉండేది.అయితే కాంగ్రెస్(Congress)​ అధికారంలోకి వచ్చాక ఈ విగ్రహాన్ని మార్చింది. గతంలో ఉన్న విగ్రహం రాచరికపు పోకడలు ఉన్నాయని, బహుజనులకు చిహ్నంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని పేర్కొంది. ఈ మేరకు కొత్త విగ్రహాన్ని రూపొందించింది. తెలంగాణ ఆడబిడ్డను గుర్తు చేసేలా.. సాధారణ మహిళలా పోరాట స్ఫూర్తిని తెలిపేలా కొత్త విగ్రహాన్ని రూపొందించినట్లు కాంగ్రెస్​ తెలిపింది.

    Telangana Thalli Statue | సచివాలయంలో ఏర్పాటు

    గతంలో ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రస్తుతం ఊరూరా ఉన్నాయి. అయితే కాంగ్రెస్​ ప్రభుత్వం(Congress government) కొత్తగా మార్పులు చేసిన విగ్రహాన్ని గతంలో సచివాలయంలో ఏర్పాటు చేశారు. సచిలవాలయంలో 17 అడుగుల ఎత్తు విగ్రహాన్ని మూడు అడుగుల పీఠంపై ఏర్పాటు చేశారు. దీనికోసం రూ.1.16 కోట్లు ఖర్చు చేశారు. తాజాగా రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్​లలో సైతం తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్ణయించింది.

    Telangana Thalli Statue | రూ.5.77 కోట్లతో..

    రాష్ట్రంలోని 33 కలెక్టరేట్​లలో రూ.5.77 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాలను నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది. సోనియా గాంధీ(Sonia Gandhi) పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్​ 9న విగ్రహాలను ఆవిష్కరించాలని నిర్ణయించింది. 12 అడుగుల ఎత్తుతో విగ్రహం ఏర్పాటు చేయాలని, ఒక్కోవిగ్రహానికి రూ.17.5 లక్షలు దాకా ఖర్చు చేయాలని యోచిస్తోంది. కాగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం.. అరుణ వర్ణపు రవిక, ఆకుపచ్చ చీర, బంగారు రంగు అంచు, కాళ్లకు పట్టీలు, మెడలో ఆభరణాలు, ఒక చేతిలో వరి, సజ్జ, జొన్న, మొక్కజొన్న కంకులు కలిగి ఉంటుంది. మరో చేయి అభయహస్తంగా చూపుతూ గ్రామీణ జీవన స్ఫూర్తి ఉట్టిపడేలా విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.

    More like this

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...

    Nizamabad | విపత్తు సమయాల్లో సమర్థవంతంగా సేవలందించాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో తక్షణసాయం అందించేలా ఆపదమిత్రలు సిద్ధంగా ఉండాలని అదనపు...

    Amit Malviya | మోదీ లాంటి నాయకుడు కావాలన్న నేపాలీలు.. వీడియోను షేర్ చేస్తూ రాహుల్ ను విమర్శించిన బీజేపీ నేత

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Amit Malviya | నేపాల్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశానికి ప్రధానమంత్రి...