ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Weather Updates | వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌.. నేడు, రేపు ఉరుములతో కూడిన వర్షాలు

    Weather Updates | వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌.. నేడు, రేపు ఉరుములతో కూడిన వర్షాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Weather Updates | పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), దక్షిణ ఒడిశా(South Odisha) తీరంలో సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడ‌డంతో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. దక్షిణ జార్ఖండ్, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1, 7.6 కి.మీ మధ్య మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడడం వ‌ల‌న తెలంగాణ (Telangana)లో పశ్చిమ, నైరుతి దిక్కు నుంచి గాలులు వీయనున్నాయి. ఈ రోజు, రేపు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం(Weather Department) వెల్లడించింది.

    Weather Updates | జ‌ర భ‌ద్రం..

    ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

    ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురంమన్యం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైద‌రాబాద్ లో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో (Thunders) అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు(Meteorological Department officers) తెలిపారు.

    More like this

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....